(1) చలికాలంలో మొక్కలకు వచ్చే సమస్యల్లో ప్రధానమైనది పెనుబంక. ఇది మొదటి దశలో మొక్క లేదా పాదు చిగురులలో ఉంటుంది. అప్పుడు మనం గుర్తుంచుకున్నట్లయితే తొందరగా నివారించుకోవచ్చు.
(2) పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఇవి ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి పాకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పూత నుండి కాయగా మరే క్రమం తగ్గిపోయి, పూత రాలిపోయి దిగుబడి చాలా తక్కువ వస్తుంది. మరీ ఎక్కువ తీవ్రత ఉంటే కనుక మొక్క చనిపోయే అవకాశం ఉంది. అలాగే మన చుట్టుపక్కల ఏమైనా గార్డెన్ ఉంటే కనుక మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్త తీసుకున్న పక్కనున్న గార్డెన్ లో నుండి మన గార్డెన్ కి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది.
(3) ఇవి ఎక్కువగా చిక్కుడు జాతి మొక్కలకు వస్తాయి. కాబట్టి మన గార్డెన్లో చిక్కుడు జాతి మొక్కలు ఉంటే వాటిని తగు జాగ్రత్తగా చూసుకోవాలి.
(4) పెనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ముందు స్ప్రేయర్ తో పేను బంకనంతా నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. తర్వాత వేప నూనె లేదా గంజి, ఇంగువ ద్రావణం లేదా పిడకల ( ఆవు పిడకలు అయితే ఇంకా మంచిది) బూడిద మరియు పసుపు కలిపి చల్లడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. 🙏
1 thought on “Winter pests-Aphids Penubanka”
Comments are closed.
We are waiting for remedy, just recd, ur posting the same in our Garden from 20 days already prepared the sai above contents liquid just 2days back, and plenty stock 20 liters “GOMUTRA ” , INGUVA ,FIOREST PASUPU, VRPA KASHAAYAM, EVERY 3 DAYS APPLIED. CONTROL THE PEST.