Vittanalu naate vidhanam – విత్తనాలు నాటే విధానం

విత్తనాలు నాటే విధానం
1. ఆకు కూరల విత్తనాలు కు కింద లేయర్ రెడ్ soil with cocopeat compost వేసిన పైన 4inch మందం కనుక ఇసుక వేసుకొని ఒక లైన్ లా లాగి 1/2 inch మందం తో అందులో విత్తనాలు వేసుకొని కప్ప నీరు spray చేస్తే బాగా మొలకలు వస్తాయి ఇంకా పడిపోకుండా ఉంట్టాయి..

2. వంగ, టమాట, మిర్చి విత్తనాలు కోకోపీట్ కొంచం ఎక్కువ వేసుకొని మీకు నచ్చిన మట్టి ఎరువు కలిపి నారు పోసుకొని 5 ఆకులు వచ్చిన తర్వాత repot చేసే రోజు 5 నిమిషాల ముందు నీరు పోసుకొని నారు లాగితే వేరులు విరగా కుండా వస్తాయి అప్పుడు అవి repot చేసుకోవచ్చు..
3 బెండ్డ విత్తనాలు కూడా నారుల పోసి repot చేయవచ్చు నేను చేశాను ఏమేమి భయం లేదు. కానీ మనం repot చేసేటప్పుడు సున్నితంగా పట్టుకొని repot చేయాలి.
4. కాకర, సొర, పొట్లకాయ లాంటి hard shell అంట్టే పైన చెక్కు ఉండి లోపల పప్పు ఉండే విత్తనాలు. వాటికీ మొక్కు లా ఉండ్డే వైపు కొంచం గోరుతో గిల్లితే పైన చెక్కి, చెక్కిన భాగం 1/2 inch మట్టిలో పెట్టి నాటుకుంట్టే 5 రోజులకే germinate అవుతాయి.
లేదా రాత్రి అంతా నాన్న పెట్టి మరుసటి రోజు నాటుకున్న వారాం రోజులలో మొలకలు వస్తాయి.

గమనించవలసిన విషయం
విత్తనాలు నాటుకునే soil లో ఎటువంటి పురుగు అనేది లేకుండా చూసుకొని నాటుకోవాలి లేదా విత్తనాలు అవి తినెస్తాయి. గాజు పురుగులు కూడా లేకుండా చూసుకోవాలి.
విత్తనాలు మొలకలు వచ్చాయక నీరు మరీ ఎక్కువగా ఇవ్వకూడదు లేకపోతే మొలకలు పడిపోతాయి.3ఆకులు వచ్చే వరకు సెమీ shade లోనే పెట్టి తర్వాత లైట్ sunlight ఏంటీర్ ఉదయం వచ్చే 1,2 hours వచ్చే ఎండా లో పెట్టుకోవాలి 6,7 ఆకులు వచ్చాక repot చేసే 5 నిముషాలు ముందు నీరు పోసుకొని మొక్క తీస్తే వేరులు దెబ్బతినకుండా వస్తాయి అప్పుడు వాటిని సాయంత్రం ఎండా లేని సమయం అంట్టే 4,5 pm సమయం లో నాటుకోని నీరు పోసుకుంట్టే మొక్క ఖచ్చితంగా బతికిద్ది.

Shopping Cart