Trichoderma viridae

Tricoderma viride :
ఇది ఒక బయో ఫంగస్. అంటే మొక్కలకి మేలు చేసే ఫంగస్. విత్తనం నుండి గాని, వేర్లు నుండి గాని మొక్కలు వచ్చే అన్ని రకాల ఫంగస్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. (అంటే మనం బయట నుండి తెచ్చుకునే విత్తనాలు, మొక్కలు) అందుకని ఇది మన కుండీల్లో వేసుకోవాలి. ఇది పౌడర్ రూపంలో మరియు లిక్విడ్ రూపంలో ఉంటుంది. కుండీలో కొత్తగా మట్టి నింపుకునే సందర్భంలో వేసుకోవడం వల్ల మొక్కకు రక్షణగా ఉంటుంది. అలాగే ముందే పెట్టినటువంటి ఎదిగిన మొక్క ఉన్నటువంటి కుండీలో ఇది వేయాలంటే కనుక ఒక చిన్న ఐరన్ రాడ్ తీసుకొని కింద కల్లా హోల్స్ పెట్టి ఇది వాటర్ లో కలిపి అందులో పోస్తే కనుక బాగా పనిచేస్తుంది . మనకి ఇంకా interest ఉంటే దీనిని మనం మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులో బెల్లం నీటితో కలిపి తడి గోని సంచికప్పి 48 గంటల తరువాత వాడుకోవడం వల్ల ఎక్కువ ఫంగస్ అభివృద్ధి చెందుతుంది. మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. బయో ఫంగస్ వాడే సందర్భంలో మనము కుండీ పైన మల్చింగ్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. దీనివల్ల కుండీలో తగిన తేమ ఉండి ఫంగస్ ఎక్కువ రోజులు మన కుండీలో ఉండి మొక్కలకి రక్షణగా ఉంటుంది. మల్చింగ్ వేసుకునే ముందు మనం మల్చింగ్ ని గోరువెచ్చని నీటిలో పావుగంట నానబెట్టి తర్వాత మల్చింగ్ వేసుకుంటే ఎండిపోయిన ఆకులు వల్ల కూడా ఎటువంటి ఫంగస్ మన కుండీలోకి రాదు. అలాగే మనము విత్తన శుద్ధిని కూడా దీనితో చేసుకోవచ్చు. (అంటే బయట నుండి తెచ్చే విత్తనాలు & మొక్కలు ).
1 ltr కి 10 ml చొప్పున వాడచ్చు.
అలాగే ఎక్కువ వర్షాలు పడినప్పుడు కుండీలో నీరు నిలబడి మొక్కల వేర్లు కుళ్లిపోయి మొక్క చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కుండీలో ఉన్నటువంటి అదనపు వాటర్ తీసేసి ఈ ట్రైకోడెర్మా విరిడి పౌడర్ ను నీళ్లలో కలిపి మొక్క మొదట్లో వేయడం వల్ల మొక్క బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను ఆల్రెడీ ట్రై చేశానండి ఇది. చాలా బాగుంది.
Shyam Prasad

1 thought on “Trichoderma viridae”

Comments are closed.

Shopping Cart