ఆకు కూరలు చాలా సుకుమారంగా పెంచాలి.
నీటి యాజమాన్యం పాటించాలి.
మట్టి లో తేమ ఉండాలి గాని నీరు ఉండకూడదు.
ఇంకా ఎటువంటి కషాయము , ముఖ్యంగా ఆవు మూత్రం తో తయారు చేసినవి, వేప నూని ఉన్నవి అధికము మోతాదులో వాడకూడదు.
కూరగాయలు కన్నా వీటికి నీరు 2 రేట్లు అధికముగా కలిపి పిచికారి చేసుకోవాలి.
మొక్కలు మధ్య దూరం నిర్దిష్టంగా ఉండాలి సరి అయిన గాలి సమపాళ్లలో తగినంత వెలుతురు ఉండాలి.
వీటిలో ఏది ఎక్కువ గాని తక్కువ గాని అయిన వీటి ఆకలు సున్నితం గనుక త్వరగా కీటకాలు, సిలిద్రియలు అసిస్తాయి.
అందుకే ముందుగా మడులు లేదా కుండీలను శుభ్రం చేసుకోవాలి.
కుండీలు అయితే మట్టిని మొత్తం తీసివేసి ఎండలో అరబెట్టి మట్టిని కూడా, కుండీలను అలాగే వాడుకునే మట్టి మిశ్రమాన్ని ఎటునటి contaminations లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి .
మట్టి మిశ్రమం లో biocultures, seed cakes తగు మోతాదులో వేసుకొని వాడుకోవాలి.
ఆకుల మీద ఎటువంటి నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
Rosecan తో నీరు ఇవ్వాలి.
ఎక్కువ వత్తిడితో నీరు hosepipe తో ఇవ్వకూడదు.
తెగుళ్లకు పుల్లటి మజిగ్గ ద్రావణం లీటరుకు 5 నుండి 10 ml మోతాదులో కలిపి వదలి.
అదే కూరగాయలు అయితే 30 ml లీటరు నీటికి.
Neem oil మొక్కలు మొలిచిన 15 , మరియు 22 రోజుల వ్యవధిలో 2 సార్లు లీటరుకు 1.5 ml, అదికూడా అవసరాన్ని బట్టి వాడుకోవాలి.