మిద్దెతోట కు స్వాగతం –
ఈ వారం పొట్ల పాదు గురించి తెలుసుకుందాం..
పొట్ల కూడా తీగ జాతి మొక్క..
పొట్ల పాదు ను మే నుంచి జులై వరకు వేసుకోవాలి..
అప్పుడే దిగుబడి బాగుంటుంది..
చలికాలంలో పొట్ల పాదు సరిగా పెరగదు..
జనవరి .. ఫిబ్రవరి నెలలో విత్తుకున్నా షేడ్ నెట్ లేకపోతే కాయలు రావు.. తీగ మాత్రం పెరుగుతుంది..
అందుకే మే లో విత్తుకుంటే జులై నుంచి కాయలు వస్తాయి..
పొట్ల విత్తనాన్ని .. అన్ని తీగ జాతి విత్తనాల లాగానే ఎక్కడ పెంచుకోవాలంటే అక్కడ నేరుగా మట్టిలో పెట్టుకోవాలి..
అలాకాకుండా కొంచెం పెరిగిన తర్వాత మడులలో నాటుకోవాలనుకుంటే ..
చిన్న చిన్న కాగితం గ్లాసుల లో కానీ.. చిన్న చిన్న కుండీలలో కానీ విత్తుకుని కొంచెం పెరిగిన తర్వాత తీసి జాగ్రత్తగా మడులలో నాటుకోవాలి..
మిద్దెతోట లో ఒక కుటుంబానికి సరిపడా కాయలు రావాలంటే ఏదో ఒకటి రెండు విత్తనాలు పెట్టుకుంటే సరిపోదు.. కనీసం ఐదారు విత్తనాలు పెట్టుకోవాలి..
పొట్ల లో కూడా రకాలు ఉన్నాయి.. పొడుగు పొట్ల , పిచ్చుక పొట్ల..చారల రకం ఇలా రకాలు ఉన్నాయి..
ఇది తీగ జాతి కాబట్టి దీనికి పందిరి అవసరం..
మిద్దెతోట లో నిలువు పందిరి వేసుకుంటే స్థలం కలిసి వస్తుంది..
దీనిని చిన్న కుండీలో పెడితే మొక్క సరిగా ఎదగదు..
పెద్ద కుండీల్లో అయితే దీని వేర్లు బాగా విస్తరించి మొక్క బాగా పెరుగుతుంది..
తీగ జాతి మొక్క ల్లో దిగుబడి బాగా రావాలంటే..3 జీ కటింగ్..ఇంకా హ్యాండ్ పాలినేషన్ చేయాలి..
ఇలా చేస్తే తీగె లు ఎక్కువగా వచ్చి దిగుబడి బాగుంటుంది..
లేకపోతే ఒకే తీగ ఉంటే మగపువ్వులే వస్తాయి..
ఇక పాలినేషన్ ఎలా అంటే..
పొట్ల లో హ్యాండ్ పాలినేషన్ అవసరం అంతగా ఉండదు.. ఎందుకంటే పొట్ల పువ్వు లు ఉదయం పూట వస్తాయి..
సాయంత్రానికి వాడిపోతాయి..
ఆ టైమ్ లో పాలినేషన్ జరగడానికి తేనెటీగలు , సీతాకోకచిలుక లు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి హ్యాండ్ పాలినేషన్ అవసరం ఉండదు..
అలా తేనెటీగలు , సీతాకోకచిలుకలు మన తోటలో బాగా తిరుగుతూ సహజంగా పాలినేషన్ జరగాలి అంటే ..
మిద్దెతోట లో పూల మొక్కలు పెంచుకోవాలి..
దిగుబడి బాగా రావాలంటే పదిహేను ఇరవై రోజుల కు ఒకసారి గుప్పెడు కంపోస్టు కానీ.. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వాలి..
ఇక దీనిలో చీడపీడలు..
పండుఈగ..ఆకు ముడత..పచ్చపురుగు..పచ్చపేను..
పండుఈగ కు జిగురు అట్టలు.. ఇంకా ఫెరొమొనీ ట్రాప్స్ పెట్టుకోవచ్చు..
ఆకు ముడత కు పుల్లటి మజ్జిగ లో ఇంగువ, పసుపు వేసి కలిపి డైల్యూట్ చేసి మొక్కల మీద చల్లాలి..
లేదా .. నీళ్ళలో పసుపు వేసి మరిగించి చల్లారిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి ఒక రాత్రి ఉంచి ఆ నీటికి సమానంగా నీళ్లు కలిపి పిచికారి చేయాలి..
పచ్చపురుగు కు.. చేతితోనే తీసేయాలి..
అలా చేసినా ఇంకా ఎక్కువ ఉంటే వేపనూనె , కుంకుడు కాయ రసం కలిపి పిచికారీ చేయాలి..
పచ్చపేను కు .. ఆకులు తడిపి వెనుక భాగంలో బూడిద పసుపు కలిపి చల్లుకోవాలి..
లేకపోతే జిగురు అట్టలు పెట్టుకోవాలి..
ఇంకా ఇంతకు ముందు చెప్పినట్లు .. వంటనూనె , బేకింగ్ సోడా , లిక్విడ్ సోప్ వాటర్ లో కలిపి పిచికారి చేయాలి.
సశేషం
మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం
ఇట్లు
లత మిద్దెతోట