లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసే విధానం
లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా గాలిచేత కాపాడబడే సూక్ష్మజీవులు. ఆక్సిజన్ లేని సమయంలో ఇవి చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తాయి. లాక్టిక్ ఆమ్ల బాక్టీరియా నేలలో గాలి ప్రసరించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల పండ్ల తోటలు మరియు ఆకు కూర తోటల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.
కావలసిన వస్తువులు / పదార్థాలు
1. బియ్యం కడిగిన నీరు
2. పాలు (పచ్చివి/వెన్నతీయనివి)
3. బెల్లం
4. మట్టికుండ / గాజుపాత్ర
5. తెల్ల కాగితం
6. రబ్బర్బ్యాండ్లు / దారం
పాల నుండి లాక్టిక్ అమ్ల బాక్టీరియాను తయారు చేసే పద్ధతి
1. బియ్యం కడిగిన నీళ్ళను పాత్రలో 15 నుండి 20 సెం.మీ. వరకు పోసి, పాత్రను కాగితం మూసి, నీడలో ఉంచాలి.
2. లాక్టిక్ ఆమ్ల బాక్టీరియాలు 28 – 25 O ఉష్ణోగ్రత వద్ద అభివృద్ధి చెందుతాయి. ఆ (ద్రావణం పులిసిన వాసన రావటం మొదలవుతుంది.
3. ఈ పులిసిన బియ్యపు నీటికి పాలను కలపాలి. పాలు మరియు బియ్యపు నీరు నిష్పత్తి 3:1/గ్రా. ఉండాలి. మార్కెట్లో దొరికే చల్లని పాశ్చరైజ్ చేయబడిన పాలను కూడా వాడవచ్చును. కొన్నిసార్లు నిల్వ ఉన్న పాలు ఎక్కువగా ఉపయోగపడవు. ఆవుపాలు శ్రేష్టమైనవి, వీటిని వాడితే చాలా మంచిది. బియ్యపు నీటిలో కంటే పాలలో పోషకాలు అత్యధికంగా ఉండడంవల్ల లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియాలు చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతాయి.
4. మూడు నుండి నాలుగు రోజులలో, పాత్రలో మూడు పొరలు విడివిడిగా ఏర్పడతాయి.
ఎ) తేలుతున్న పదార్థం,
బి) స్వచ్చమైన (ద్రావణం,
సి) మడ్డి (వ్యర్థం) పదార్థం, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, మాంసకృత్తులు = ఉపరితలం తేలుతాయి. వ్యర్థ పదార్థం పాత్ర అడుగుభాగానికి చేరుతుంది.
పసుపు పచ్చని (ద్రావణం మధ్య భాగానికి చేరుతుంది. ఇదే లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. తేలుతున్న పదార్థాన్ని తీసి వేసి, పసుపు పచ్చని (ద్రావణాన్ని ప్రత్యేక పాత్రలోకి తీసుకొని చల్లని / శీతల వాతావరణం(ఫ్రిజ్)లో నిలువ ఉంచాలి.
లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియాను ఎలా వాడాలి?
1. 1:1000మి.లీ. నిష్పత్తిలో ఈ (ద్రావణాన్ని ఉపయోగించాలి. (1 మి.లీ. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా : 1000 మి.లీ. నీరు)
2. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా మొక్కల కాండం మరియు ఆకుల మీద ఉన్న సూక్ష్మజీవుల యొక్క జీవక్రియను మరియు పునరుత్పత్తి శక్తిని పెంచుతాయి. ఇది శిలీంధ్రాలను కీటకాలను నాశనం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది.
3. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియాను ఉపయోగించుట వలన పండ్లు, ఆకుల పరిమాణం పెరుగుతుంది. కానీ దీని మోతాదును పంట చివరి దశలలో క్రమంగా తగ్గించి వాడాలి.
లాక్టిక్ ఆమ్మ బ్యాక్టీరియా వలన ఉపయోగములు
1. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా నేలలో గాలి ప్రసరించడానికి ఉపయోగ పడుతుంది. దీనివల్ల ఆకుకూరలు , పండ్ల అభివృద్ధికి సహకరిస్తుంది.
2. మొక్కలను నాటేటప్పుడు వేరు అభివృద్ధిని మరియు కాండ అభివృద్ధిని పెంచుతుంది. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియాను శాఖీయ అభివృద్ధి దశలో, పండ్ల ఉత్పత్తిలో వాడినప్పుడు మంచి రకమైన పండ్లను, ఎక్కువకాలం పండ్లను నిలువ ఉండేవాటిని ఉత్పత్తి చేయవచ్చు
—