పిండి నల్లి నివారణ పద్ధతులు:
1. పిండి నల్లి సోకిన మొక్కలను మీ గార్డెన్ నుంచి వేరు చేసుకోవాలి. లేకపోతే ఈ పురుగు గార్డెన్ లో అన్ని మొక్కలకు సోకుతుంది
2. పిండినల్లి ఎక్కువగా సోకిన ఆకుల్ని కొమ్మల్ని మొక్క నుంచి కత్తిరించి గార్డెన్ నుంచి దూరంగా పడేయాలి. తర్వాత అన్నం తో తయారు చేసుకున్న పురుగుమందులు చల్లుకోవాలి.
పిండి నల్లి నివారణకు సేంద్రియ పురుగుమందుల తయారీ విధానం:
1. ఆ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని సీసాలో లేదా ఒక డబ్బాలో తీసుకొని ఒక లీటరు నీటిని కలిపి 7 రోజులు పులియబెట్టిలి.
2. పులియబెట్టిన అన్నాన్ని ఒక కర్రతో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రోజుకి ఒక్కసారి తిప్పాలి ఇప్పుడు అన్నం లోని సారం అంతా నీటిలోకి దిగుతుంది
3. వారం రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసుకొని 1:1 లేదా 1:2 లో నీటిని మరియు ఒక చెంచా వెజిటేబుల్ నూనెను కలిపి పిండి నల్లి సోకిన మొక్కల పై చల్లాలి. పిండినల్లి తీవ్రతను బట్టి వారానికి ఒకసారి మనం ఈ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి
Courtesy : CTG FB