OWDC PREPARATION & USE

HOW TO USE OWDC- LIQUID WASTE DECOMPOSER.

100 liter ల నీరు తీసుకోండి
(కొళాయి నీరు అయితే రెండు రోజులు ఓపెన్ గా ఇంచి అప్పుడు వాడండి)
1 కేజీ బెల్లం బాగా కలపండి.అందులో OWDC సీసా వేసెయ్యండి..
5 రోజుల పాటు రోజూ కర్రపుల్లతో కలియబెట్టండి..

6 వ రోజున అది
1) 1:2 ratio ( ఒక liter ద్రావణాన్ని రెండు లీటర్ ల నీరు కలిపి )లొ మట్టిలో వేయవచ్చు.
2) 1:3 ratio ( ఒక liter ద్రావణాన్ని మూడు లీటర్ ల నీరు కలిపి) లో ఆకులపై స్ప్రే చేయవచ్చు.
3) కంపోస్ట్ బిన్ లో కంపోస్ట్ త్వరగా అవ్వడానికి ప్రతీ layer కి spray చేయవచ్చు..
4) విత్తనాలు నాటే అరగంట ముందు వాటిపై జల్లి విత్తన శుద్ది చేయ వచ్చు.

5) మీరు ఒక వారం పది రోజుల kitchen waste తీసుకుని దానిని mixie లో ముద్దగా నూరి తయారయిన OWDC ద్రావణం లో వేసి దానితో పాటు కొద్దిగా బెల్లం వేసి రోజూ కలుపుతూ 15 రోజుల తరువాత ఒక liter కి 5 లీటర్ ల మామూలు నీరు కలిపి మొక్కలకు ఎరువుల వేస్తే బ్రహ్మాండం గా పనిచేస్తుంది..kitchen waste compost చేసుకునే సమయం ఆదా చేయవచ్చు. ఇలాగే kitchen waste బదులు mustard cake గాని, వేరు చేనగ చెక్క గాని, రెండూ కలిపి గాని వేసి ఉపయోగించ వచ్చు.
పైన చెప్పినవి 100 లీటర్ ల ద్రావణానికి

-అదే 200 లీటర్ లకు 2 కేజీ ల బెల్లం వేసుకోవాలి.
-50 లీటర్ లకు అర కేజీ బెల్లం .
– 20 liter ల ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి 200 గ్రాముల బెల్లం, సరిపోతుంది.

దీనినే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే ఉదాహరణకు 100 లీటర్ లు తయారు చేసుకుని వాడుకున్నాక, లాస్ట్ లో 10 లీటర్ లు అలానే ఉంచి మరల 100లీటర్ ల నీరు, ఒక కేజీ బెల్లం కలిపి 5 రోజుల తరువాత వాడుకోవచ్చు..ఇలా మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు.

కనీసం వారానికి ఒకసారి owdc వాడండి..3 నెలల్లో మొత్తం గార్డెన్ అంత పచ్చగా అయిపోతుంది, చీడపీడలు ఉండవు..మొక్కలు బలం గా అవుతాయి.ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు.
-I.V. Prasad  : CTG Rajahmundry

:–

Shopping Cart