ముఖ్యంగా మన గార్డెన్ లోకి తెల్ల దోమ, పచ్చ దోమ ఇట్లాంటి రావడం అనేది సహజం. ఈ దోమలు రావడానికి ముందే మనము ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ మన గార్డెన్ లో పెట్టుకోవాలి. ఈ ట్రాప్స్కి వుండే కలర్స్ వల్ల దోమలు వాటికి ఎట్రాక్ట్ అయ్యి వాటికి ఉండే జిగురుకి అతుక్కుని చనిపోతాయండి. దీనివల్ల చాలా వరకు మన గార్డెన్లో దోమలు సమస్య తగ్గిపోతుంది. అలాగే మన గార్డెన్లోని మొక్కకి గాలి, వెలుతురు వచ్చేటట్లు చూసుకోవాలి. అంటే కింద ఉన్నటువంటి ముదురు ఆకులు గానీ, అలాగే పండిపోయి ఎండిపోయిన ఆకులు గానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల గాలి వెళ్తురు వచ్చి ఇటువంటి దోమల సమస్య కూడా తగ్గుతుంది. ఎల్లో ట్రాప్ వచ్చేసరికి మనకి తెల్ల దోమ ని, లీఫ్ మైనర్ ని కంట్రోల్ చేస్తుంది. తెల్ల దోమల వల్ల మనకి పల్లాకు తెగులు అంటే మొజాయిక్ తెగులు అంటారు అది వస్తుంది. లీఫ్ మైనర్ అంటే మనకు అందరికీ తెలిసింది టమాటా మొక్కల మీద మరియు ఇతర మొక్కల మీద పాముల్లా చారులు ఉంటాయి. వాటిని లీఫ్ మైనర్ అంటారు. ఈ రెండిటిని కూడా ఎల్లో ట్రాక్ వల్ల కంట్రోల్ అవుతుంది. అలాగే తామర పురుగులు పెనుబంక,ఇతర కీటకాలు అన్నీ కూడా బ్లూ ట్రాప్పి అట్రాక్ట్ అయి దానికి అంటుకొని చనిపోతాయండి. మనం గార్డెన్ మొదలు పెట్టిన వెంటనే ఈ traps పెట్టుకోవాలి అలాగే ఈ ట్రాపులు మనం నాలుగు అడుగుల నుండి ఆరడుగులు లేదా ఏడు అడుగులు ఎత్తు మధ్య గ్యాప్ లో పెట్టుకోవాలి. ముఖ్యంగా మన కూరగాయ జాతి మొక్కలకి పూత పింద ఉన్న ప్రదేశంలో ఎక్కువగా పెట్టుకోవాలి. వీటిని ధర వచ్చి సుమారుగా 15 రూపాయలు లోపు ఉంటుంది. ఇవి రెండు సైజుల్లో దొరుకుతాయి ఒకటి ఏ4 సీట్ అంత ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏ ఫోర్ షీట్ లో సగం అంత sticky pads రెండు రకాలు ఉంటాయి. మన దగ్గర 10 కుండీలు ఉంటే సుమారుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఎల్లో ట్రాప్, blue trap ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంటే గనుక దానికి తగ్గట్టుగా మనం పెంచుకోవాలి అలాగే ఘాటైన ఆయిల్స్ గాని, ఘాటైన పదార్థాలు అంటే వెల్లుల్లి మిర్చి ఇట్లాంటివి స్ప్రే చేసినా గాని మనకు ఉపయోగం ఉంటుంది గోమూత్రం కూడా కలుపుకోవచ్చు. మన గార్డెన్లో ఈ దోమలు కంట్రోల్ చేయాలంటే ప్యాడ్స్ చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఈ ప్యాడ్స్ ని నేను ఒక సంవత్సరం నుండి వాడుతున్నాను. నాకైతే ఈ పురుగులు సమస్య ఎప్పుడు వచ్చేదానికన్నా తక్కువగానే ఉంది.🙏