*మిద్దె తోటలో బంతి పూల మొక్కల ప్రయోజనాలు* #CityofTerraceGardens
* మిద్దె తోటల లో తీగజాతి కూరగాయల మొక్కల్లో మనకి ఎదురయ్యే ప్రధాన సమస్య pollination.
* అందుకే మిద్దె తోట లో కూరగాయల మొక్కల మధ్యలో తప్పకుండా బంతి పూల మొక్కలు నాటుకోవాలి.
* పొలాల్లో కూడా పొలం గట్ల మీద రైతులు బంతి పూల మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు.
* బంతి పూవులు తుమ్మెదలు, తేనెటీగ ల ను ఎక్కువ గా ఆకర్షిస్తూ ఉంటాయి, అంతే కాకుండా మొక్కలని ఆశించే చీడ పీడలను కూడా బంతి మొక్కలు ఆకర్షిస్తూ ఉంటాయి, దాని వల్ల ఆకుకూరగాయలు కూరగాయలు మొక్కలకి తెగుళ్ళు అంతగా రావు.
* ఇక బంతి మొక్కల విత్తనాల ను జూన్,జులై నెలల్లో లో వేసుకోవాలి,
* బంతి మొక్కలను కొమ్మల ద్వారా కూడా propagate చేసుకోవచ్చు, ఒక 6 to 7 inch పొడవు ఉన్న బంతి కొమ్మలను తీస్కుని వాటికీ పువ్వులు, మొగ్గలు తీసేయాలి, కొమ్మ కింద 2 ఇంచుల వరకు ఆకులు తీసేయాలి. ఇప్పుడు ఆ కొమ్మలని ఒక గ్లాస్ లో నీళ్లు పోసి ఆ గ్లాస్ నీళ్లలో ఉంచాలి, ఒక 10 రోజుల్లో కొమ్మలకి వేర్లు వస్తాయి.
* బంతి మొక్కలను medium size కుండీ ల లో వేస్కుని ఆ కుండీ లను కూరగాయల మొక్కల మధ్యలో పెట్టుకోవచ్చు.
*THANK YOU*.
*SRINIVAS KHAMMAM*.
*CTG-19*