LACTIC ACID BACTERIA -LAB -PREPARATIOIN AND USES

Lactic Acid Bactria L.A.B
Add life to your soil

కావలసిన పదార్ధాలు :-
1. బియ్యం కడిగిన నీళ్లు
2. పాలు
తయారీ విధానం
* బియ్యం మొదటి సారి కడిగిన నీళ్లు ఒక గ్లాస్ తీస్కోవాలి.
ఆ నీళ్లని కొంచం పెద్ద ప్లాస్టిక్ పాత్ర లో తీస్కుని white paper తో ముసివేసి ఒక పక్కన పెట్టుకోవాలి.
* ఇలా 5 రోజులు ఉంచాక ఆరవ రోజు ఆ పాత్ర ని కప్పి ఉంచిన ఉన్న white paper తీసి fermant ఐన బియ్యం నీళ్లని కలిపి అందులో మూడు గ్లాస్ లా పాలు పోయాలి.
* మళ్ళీ ఈ పాత్ర ని white paper తో మూసి ఒక 5 రోజులు ఉంచాలి.
* 6 వ రోజు ఆ పాత్ర కి ఉన్న white paper ని తీసేసి చూస్తే పాత్ర అడుగున మూడు layers ఏర్పడి ఉంటాయి
పై నుండి మొదటి లేయర్ ముద్ద లా ఉంటుంది అది ప్రోటీన్ క్యాబోహైడ్రెట్స్.. ఇది మనకి అవసరం లేదు
రెండో లేయర్ నీళ్లలా ఉంటుంది ఇదే lactic acid bactria.. ఇది మనకి అవసరం.
మూడవ లేయర్ కుడా కొంచెం ముద్దగా గా ఉంటుంది ఇది waste పనికి రాదు.
* ఇప్పుడు ఈ పాత్ర లో తయారయిన 3 layers ని ఒక filter గరిట తో ఇంకో bottle లోకి వడకట్టాలి.
* ఇప్పుడు మనకి అసలైన lactic acid bacteria ధ్రావణం bottle లో ఉంటుంది.
* దీనికి ఏం మాత్రం తడి తగలకుండా చూసుకోవాలి.
* ఈ ధ్రావణం మనకి 15 రోజుల దాక నిలవ ఉంటుంది.
* ఒకవేళ ఒక 6 నెలలు ఉండాలి అంటే ఈ ధ్రావణం కి కొంచం బెల్లం కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

ఉపయోగాలు

ఈ LAB లో Anaerobic బాక్టీరియా ఉంటుంది అంటే ఇది ఆక్సిజన్ లేకుండా పెరిగే బాక్టీరియా.
* ఎంత వేడి high టెంపరేచర్ ఉన్న ఈ బాక్టీరియా తట్టుకుంటుంది.
* ఇది మట్టి ని సారవంతం చేస్తుంది
* మట్టి ని గట్టి పడకుండా గుల్ల గా ఉంచుతుంది, ఒకవేళ గట్టి పడిన మట్టి అయినా కానీ రెగ్యులర్ గా ఇది వాడటం వలన మట్టి వదులుగా అవుతుంది.
* మనం compost లు చేస్కునేటప్పుడు కుడా ఈ LAB నీళ్లని చల్లుకోవచ్చు
* కొత్తగా మొక్కలు, విత్తనాలు పెట్టుకునేటప్పుడు మట్టిలో ఈ LAB water ని కలుపుకోవాలి.
* ఎక్కువ సార్లు వాడిన మట్టి లో కూడా ఈ LAB నీళ్లని చల్లితే మట్టి సారవంతం అవుతుంది.
* మొక్క పూత పిందే దశ లో ఉన్నప్పుడు ఈ lab ని ఇచ్చుకోవచ్చు.
* ఈ LAB ని మొక్కల కి స్ప్రే చేయడం వల్ల కొన్ని రకాల ఫంగస్ లు రాకుండా చూసుకోవచ్చు.
వాడుకునే విధానం
* ఒక లీటర్ నీళ్ళకి ఒక 3 ml LAB ను కలుపుకుని మొక్కకి మట్టి లో ఇవ్వచ్చు స్ప్రే చేయచ్చు.

CTGian Srinivas, kammam

Shopping Cart