Knee Pains . Maha Beera

మోకాళ్ళ నొప్పులను తగ్గించే మహాబీర చెట్టు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు,
ఈ చెట్టు విత్తనాలు మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి.

ఈ విత్తనాలను మహాబీర విత్తనాలు అని పిలుస్తారు. ఇవి ఆయుర్వేదం షాప్ లలో విరివిగా లభ్యం అవుతాయి. రాత్రి సమయంలో అరస్పూన్ గింజలను గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఈ గింజలు మరుసటి రోజు ఉదయానికి సబ్జా గింజల మాదిరిగా తెల్లగా అవుతాయి. కానీ ఈ గింజలకు జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇదే మోకాలు లో గుజ్జును వచ్చేలా చేస్తుంది.
ఈ విధంగా మూడు నెలల పాటు తాగితే కీళ్ల మధ్య గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా తాగటం వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే శరీరంలో పెరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసంను గజ్జి, తామర, దురద ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
పాదాల పగుళ్లను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేసి క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. కాన్సర్ తగ్గించే శక్తి కూడా ఈ విత్తనాలు కూడా ఉంది.
ధన్యవాదములు -Shailaja Anil
Member -CTG

Shopping Cart