Kitchen Composting – Home Composting

Composting…. Home Composting.. Community Composting… Kitchen Composting: మనదేశంలో ఉన్న ప్రధాన సమస్యల్లో చెత్త కూడా ఒకటి. ఇటువంటి చెత్తను అంటే కిచెన్ వేస్ట్ గాని, ఎండు ఆకులు గానీ, మనం పెంచిన మొక్కల తాలూకు వ్యర్ధాలు గాని మనం మున్సిపాలిటీ వారికి ఇవ్వకుండా కంపోస్టు ద్వారా మొక్కలకు కావలసిన నల్ల బంగారాన్ని మనము తయారు చేసుకున్నాము. ఇలా మనం తయారు చేసుకున్న కంపోస్టు ను మనము మన మొక్కలకు ఎరువుగా ఇస్తున్నాము. కంపోస్ట్ చేసే క్రమంలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కొంతమంది కంపోస్ట్ చేసి సక్సెస్ అయిన వారు ఉన్నారు. కొంతమంది వాసన, పురుగులు ఇట్లాంటి సమస్యల వల్ల కంపోస్ట్ చేయడం లేదు. కొంతమంది అసలు కంపోజ్ ఎలా చేయాలి అని తెలియక చేయడం లేదు. కనుక మనలో చాలామంది కిచెన్ కంపోస్ట్ చేయడంలో మంచి పట్టు సాధించారు. ఎవరికి వారు ఎలా సక్సెస్ అయ్యారు, అలాగే కంపోస్ట్ చేయడంలో మెలుకువలు మనము ఈ వారం అనగా సోమవారం నుండి శనివారం వరకు మన గ్రూపులో షేర్ చేసుకుందాము. మన యొక్క విలువైన అభిప్రాయాలు కొత్తగా గార్డెన్ ప్రారంభించే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటాయి కాబట్టి అందరూ మీరు కంపోస్ట్ ఏ విధంగా చేస్తున్నారో వీడియో గాని, text message గాని మరియు వాయిస్ మెసేజ్ గాని పెట్టండి ఈ క్రమంలో ఎవరికైన సందేహాలు వస్తే వారు అడిగిన వాటిని మనం ఈ వారం రోజులు టాపిక్ గా పెట్టుకున్నాను. 🙏

6 thoughts on “Kitchen Composting – Home Composting”

  1. Boddupalli Rama Mohana Rao

    Very much interested to join CTG 20 Group.
    Very active and gardening oriented group with experts in gardening .

  2. మా కిచెన్ లో వచ్చే. ఉల్లిపాయలు కూరగాయల వేస్ట్ ముక్కలు. ఆకు కూర వేస్ట్ కట్టింగ్స్. వేర్లు ఆకులు. అవి పురుగులు లేనివి మాత్రమే ఒక పెద్ద కుండి లో అడుగున వేస్ట్ వాటర్ (decomposer). కలెక్ట్ చేసుకునే ఒక బాటిల్ నీ ఉంచి. ఆ పెద్ద కుండి ఆ వేస్ట్ వేసి డైలీ వేస్తూ వాటిలో కొంచం మట్టి వేసి. మూత పెట్టి అది పూర్తిగా కంపోస్ట్ గా తయారు అయ్యే వరకు ఉంచుతాను. పూర్తిగా తయారు అయిన కంపోస్ట్ లో స్మెల్ రాదు నల్లగా మట్టి లా ఉంటుంది అది తీసి మొక్కలు అందిస్తాను. మి అనిల్

  3. Yasalapu Kalpana

    Kitchen waste,next level dry leaves and sprinkle little bit butter milk continue this process till the bin to fill and store mix everyday after 15 to 20 days compost is ready

Comments are closed.

Shopping Cart