* మల్లె చెట్టు గురించి చెప్పాలి అంటే…
* మల్లె చెట్లు లేని ఇళ్ళు ఉండవు అనే చెప్పచ్చు.. ఎక్కడో కొన్ని చోట్ల తప్ప.
* మనం ఎక్కువ గా చూసే మల్లె రకాలు :-
దంతర్ మల్లె
బొండు మల్లె
పందిరి మల్లె
* మల్లె మొక్క కి వేరు వ్యవస్థ చాలా ఎక్కువ..
అంధుకే కుండీ లో పెట్టుకోవాలి అనుకునే వాళ్లు కొంచం పెద్ద size కంటైనర్ తీస్కోవాలి
* కొత్తగా మల్లె మొక్క పెట్టాలి అనుకున్నప్పుడు soil mix విషయానికి వస్తే మట్టి
ఆవు పేడ ఎరువు
కోకోపీట్ / వడ్ల ఊక
ఇవి సమానం గా కలిపి కుండీ నింపి ఒక 5 రోజులు నీళ్లు చాలుతూ ఉండాలి, కంపోస్ట్ నుండి వచ్చే వేడి తగ్గాక అప్పుడు మొక్క నాటుకోవాలి.
* మల్లె మొక్క కి 6 to 8 గంటలు ఎండ ఉండాలి.
* ఇక unseason లో ఎన్ని పోషకాలు ఇచ్చినా కాని మల్లె పువ్వులు పూయవు, అందుకే ఆ time లో మొక్కని కాపాడుకుంటూ ఉంటే చాలు.
* ఇక ఫిబ్రవరి వచ్చాక మల్లె చెట్టు కి ఉండే ఆకులన్నీ తీసేయాలి, టిప్స్ అన్ని cut చేయాలి.
* ఇలా చేయడం వల్ల కొత్తగా చిగుర్లు వచ్చి ఆ కొత్త కొమ్మలకి మొగ్గలు వస్తాయి.
* ఈ time లొనే మొక్కకి Nitrogen
Potasium
Phasparous
ఎక్కువగా ఇవ్వాలి
* phasparous ఇవ్వడం వల్ల మొక్క వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది, దాని వల్ల మొక్క బలం గా పెరుగుతుంది.
* nitrogen ఇవ్వడం వల్ల మొక్కకి కొత్త ఆకులు కొమ్మలు బాగా పెరుగుతాయి.
* potacium ఇవ్వడం వల్ల మొక్కకి పువ్వులు ఎక్కువ గా వస్తాయి
* Nitrogen, potacium, phasparous కోసం మనం మొక్క కి
:- Vermi compost
:- Bone meal
:- Neem powder
:- Epsom salt
ఈ నాలుగు ఇవ్వాలి.
* వీటి తో పాటు ప్రతి వారం బాగా పండిపోయిన అరటి పళ్ళు, epsom salt కలిపిన జీవామృతం ఇస్తూ ఉండాలి.
* పువ్వలు పూసి అయిపోయిన కొమ్మని 1inch వరకు cut చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు, మొగ్గలు వస్తాయి.
* ఇలా ఎందా కాలం అంతా ఈ పోషకాలు ఇస్తూ ఉంటే చాలా ఎక్కువ పువ్వులు పుస్తూ ఉంటాయి, వీటిలో ఏ పోషకాలు తగ్గినా కాని మొగ్గలు రాలి పోవడం, పువ్వులు పూయకపోవడం జరుగుతుంది.
* flowering seson అయిపోయాక ప్రతి 2yrs కి ఒకసారి కుండీ లోని మల్లె చెట్టు తీసి కొన్ని వేర్లు కత్తిరించి మళ్ళీ నాటుకుంటూ ఉండాలి.
* ఇలా చేస్తే మళ్ళీ కొత్త వేర్లు వచ్చి మొక్క బాగా పెరుగుతుంది.
-Srinivas
CTG-18