మీ మిద్దెతోటలో మొక్కలను పేనుబంక (home remedy for Aphids ) ఆశించిందని బాధ పడుతున్నారా : ఈ పద్ధతులు పాటించి మళ్ళీ మాకు చెప్పండి
ఈరోజు మనం పేనుబంక తొలిదశలో ఆశస్తే లక్షణాలు, (home remedy for aphids) వివిధ నివారణ మార్గాలు తెలుసుకుందాం
అన్ని పురుగులలో చాలా ఎక్కువగా నష్టపరిచేది- పేను బంక. ఈ పురుగులు ఆకులు లేదా పండ్లను తినవు. మొక్కల నుండి జీవాన్ని పీల్చుకుంటాయి.
పేనుబంక ప్రారంభంలో సాధారణంగా చిన్నగా, ఒక మొక్కపై మాత్రమే ప్రారంభమవుతుంది.
తనిఖీ చేయకుండా వదిలేస్తే, పేను బంక పురుగులు త్వరగా వృద్ధి చెందుతాయి. తోటలోని మిగిలిన ప్రాంతాలలో మంటలా వ్యాపిస్తాయి.
మొక్కలను పేనుబంక (home remedy for aphids) నుండి రక్షించుకోవడానికి కొన్ని మార్గాలు:
1. కంటైనర్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచండి.
2. కలుపు మొక్కలు, అనారోగ్యకరమైన/ఎండిన ఆకులు, కొమ్మలు, అన్నీ తొలగించండి.
3. మొక్కలను నిశితంగా పరిశీలించడానికి ప్రతి వారం కొన్ని నిమిషాలు కేటాయించండి.
4. పేనుబంకను గమనించినట్లయితే, ఎక్కువ వేగంగా నీటిని పిచికారీ చేయండి. ఆకుల క్రింది భాగంలో, ఇతర పురుగు దాక్కున్న ప్రదేశాలలో పిచికారీ చేయాలి. అతిథి మొక్క నుండి వాటిని భౌతికంగా వేరు చేయడానికి ఇది నిజంగా ప్రభావవంతమైన పద్ధతి. ఒకసారి పేను బంక నేలపై పడితే, అవి తిరిగి మొక్కపైకి ఎక్కలేవు.
5. పేనుబంక ఉథ్రుతి ప్రారంభ దశలో ఉన్నట్లయితే, కొన్ని చుక్కల కుంకుడు కాయ ద్రావణాన్ని సాధారణ నీటిలో కలిపి పిచికారి చేయండి. పేనుబంక వంటి పురుగులకు కుంకుడు రసం విషం.
6. తోటలో ఆవాలు, పుదీనా, నాస్టూర్టియం, బంతి పువ్వు వంటి ఎర పంటలను నాటండి.
7. పసుపు రంగు జిగురు అట్టలను ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున ఉంచాలి.
8. పేనుబంక ఉదృతిని బట్టి 1000ppm నుంచి 2000 ppm సాంధ్రత కలిగిన వేపనూనె పిచికారి చేయాలి.
Dr. Pidigam Saidaiah
Tq sir for giving a valuable tip for us happy gardening
Pingback: How To Rid Of Aphids From Home Garden: - City Of Terrace Gardens (CTG Group)