*Homemade Bonemeal*
* బోన్ మీల్ వల్ల ఉపయోగాలు ఏంటో మనం కుండీ లలో పెంచుకునే మొక్కలకి అది ఎంత అవసరమో మన అందరికి తెలుసు.
* కానీ మనలో చాలా మంది బోన్ మీల్ వాడటానికి ఇష్టపడరు.
* అలాంటి వారు మనం ఇంట్లో దొరికే పదార్ధాల తోనే ఇంట్లోనే సులభంగా బోన్ మీల్ తయారు చేసుకోవచ్చు.
* ఇంట్లో తయారు చేస్కునే ఈ బోన్ మీల్ లో కుడా మొక్కలకి అవసరం అయిన అన్ని పోషకాలు ఉంటాయి.
*కావలసిన పదార్ధాలు*
* తెల్ల నువ్వులు – 100gms
* సొయా బీన్స్ – 100gms
* ఫూల్ మఖానా – 50gms
* రాగులు – 50gms
* mustard cake – 1/4kg
* వీటిలో ఐరన్, కాల్షియమ్, మెగ్నె్షియమ్, ఫాస్పరస్, ప్రోటీన్స్, మాంగనీస్ పుష్కళం గా ఉంటాయి.
* ముందుగా నువ్వులు, రాగులు, ఫూల్ మఖానా, సోయబీన్స్ కలిపి పౌడర్ చేయాలి.
* ఇప్పుడు మనకి undecomposed bone meal ready.
* దీన్ని కొంచం mustard cake powder తో కలిపి మొక్కల కుండీ లో పైన కొంచం మట్టి తీసి ఇది పెట్టెసి పైన మట్టి కప్పాలి.
* ఇది ప్రతి రోజు మనం మొక్కకి నీళ్లు పోస్తూ ఉంటే మెల్లగా decompose అవుతూ కరుగుతూ ఉంటుంది.
* ఒక్కోసారి ఇలా undecomposed bonemeal వాడటం వలన మట్టిలో ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది.
* ఈ undecomposed bonemeal powder ని మనమే decompose చేయాలి అంటే 3 పద్ధతులు పాటించ వచ్చు.
*మొదటి పద్ధతి,*
* ఒక లీటర్ నీళ్ళని ఒక పాత్ర లో తీస్కుని అందులో 2 స్పూన్స్ మనం చేసిన బోన్ మీల్ పౌడర్ ని కలిపి, అందులో కొంచం mustard cake, కొంచం vermi compost or cow manure or kitchen compost కలపాలి.
*రెండవ పద్ధతి*
* మన ఇంట్లో compost లు ఏవి లేకపోతే
* ఒక లీటర్ నీళ్లలో ఈ బోన్ మీల్ 2 స్పూన్స్ వేసి అందులో పులిసిన మజ్జిగ కొంచం బెల్లం కొంచం mustard cake వేయాలి.
*మూడవ పద్ధతి*
* ఒక లీటర్ owdc నీళ్ళని తీస్కుని దానిలో 2 స్పూన్స్ బోన్ మీల్ పౌడర్, కొంచం mustard cake పౌడర్ కలపాలి.
* ఇలా మూడు పద్ధతులలో ఏదో ఒక దానిని ఎంచుకుని ఆ పాత్ర కి మూత వదులుగా పెట్టుకుని 15 రోజులు ఉంచాలి. ఆలా చేయడం వలన fully decomposed బోన్ meal mother culture ready అవుతుంది.
* 15 రోజుల తర్వాత దీన్ని డైల్యూట్ చేస్కుని మొక్కలకి నెల కి ఒకసారి వాడుకోవచ్చు.
-CTG Member
Vamsi Krishna