1.ఘన జీవామృతం.
ఇది వాడటం వల్ల నేల సారవంతం అవుతుంది చెట్లు పచ్చగా వచ్చి పూత కాపు బాగా వస్తాయి.
పదిహేను రోజుల కి ఒకసారి మట్టిలో పోయవచ్చు, మొక్కల పైన స్ప్రే చేయచ్చు .
2. అల్ మిక్సడ్ cake పౌడర్.
మట్టి మిశ్రమం పోషకాలతో నిండిపోతుంది పూల మొక్కలు మంచి సైజు మంచి కలర్ తో ఎక్కువ పూలు పూస్తుంది,
కూరగాయలు పండ్లు మంచి సైజు లొ ఆరోగ్యాంగా పెరుగుతాయి.
నీటిలో కలిపి ఇవ్వచ్చు. 2స్పూన్స్ కుండీలో మట్టి లూస్ చేసి కలపచ్చు.
3. ఎప్సం సాల్ట్.
కిరణజన్యసంయోగక్రియ బాగా జరిగి మొక్కలు బాగా పెరుగుతాయి. అంతే కాదు మొక్కలు వడలిపోయిన, ఎదుగుదల లేని మొక్కలకి ఇది ఇస్తే వెంటనె కోలుకుని పచ్చగా పెరుగుతాయి. క్రోటన్స్, ఇండోర్స్, పండ్లు, కూరగాయల కి ఇవ్వచ్చు.
నీటిలో కలిపి ఇవ్వచ్చు. 2 స్పూన్స్ కుండీలో మట్టిని లూస్ చేసి ఇవ్వచ్చు.
4.నీమ్ పౌడర్.
మట్టి మిశ్రమం కలుపుకునే అప్పుడు వాడవచ్చు మద్య మద్య లో ఎరువులు ఇచ్చినప్పుడు కలిపి వాడవచ్చు. మొక్కకు తెగుళ్లు ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
మట్టి మిశ్రమం లో కలపచచ్చు, మద్య మద్య లో ఎరువులు ఇచ్చినప్పుడు కలిపి ఇవ్వచ్చు.
5.Bonemeal Steamed.
కూరగాయలు, పండ్లు పూలూ మంచీ సైజు లో, పోషకవిలువల్తో పెరగాలంటే కాల్షియమ్ తప్పనిసరి ఇది ఇస్తే ప్రతి మొక్క బాగా పెరుగుతుంది.
మట్టి మిశ్రమం కలిపే అప్పుడు, మట్టిలో కలపచ్చు. మద్య మద్య లో ఎరువులతో కలిపి కుండీలో వేయవచ్చు.
6.Tricoderma.
వేరు వ్యవస్థ పటిష్టాంగ ఉండి, మొక్క ఆరోగ్యాంగా పెరుగుతుంది, చాలా రకలా శిలింద్ర నాశికారిగా కూడా పనిచేస్తుంది, ఇవి మనకు కనిపించకుండా మొక్కల్ని దెబ్బతీస్తాయి.
దినిని మనం మొక్క పైన నెలకి రెండు సార్లు స్ప్రే చేయొచ్చు, మట్టిలో కూడా ఇవ్వచ్చు.
7.Psodomenous.
కంపోస్ట్ లొ వాడచ్చు. సేంద్రియ పదార్తలని తొందరగా కుళ్ళేలా చేసి అందులోని పోషకాలని మొక్కకి అందిస్తుంది మొక్క ఏపుగా పెరుగుతుంది.
మట్టి లో కలపచ్చు , మొక్కలమీద స్ప్రే చేయోచ్చు.
8.VAM
మొక్క వేర్లలోకి వెల్లి, భుమిలో ఉన్న స్తూల సూక్ష్మ పోషకాలని మొక్క గ్రహించేలా చేస్తుంది.
ఏమి ఇచ్చిన మొక్కలు సరిగ్గా పెరగడం లేదు అన్న వారు vam ఇచ్చి చూడండి.
మట్టి లొ కలపచ్చు, కుండీలో 2 స్పూన్స్ వేయవచ్చు.
9.NPK Fixing Bacteria.
నత్రజని-ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేది ప్రొకార్యోటిక్ సూక్ష్మజీవులు, ఇవి వాతావరణం నుండి నత్రజని వాయువును అమ్మోనియా వంటి "స్థిర నత్రజని" సమ్మేళనాలుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఇవి మొక్కల ద్వారా గ్రహించ బడతాయి.
10.SEA Weed Grannuels.
సీవీడ్ ఎరువులు సేంద్రీయ జీవ-ఎరువుగా పనిచేస్తాయి. సీవీడ్‌లో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ ఆమ్లాలు మరియు ఫైటోహార్మోన్‌లు పుష్కలంగా ఉన్నందున, ఇది నేల సంతానోత్పత్తిని పెంచుతుంది. సీవీడ్ ఎరువులు మొక్కల పోషణకు మించి మొక్కలకు విస్తృత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కూరగాయలు,పండ్లు పిందెలు ఎక్కువగా పడతాయి.
డైరెక్ట్ గా కుండీలో 1 or 2 స్పూన్ల చొప్పున ఇవ్వచ్చు.
11.Baveria Bassiana.
సజీవ శిలీంధ్రాలను పంట మొక్కల కీటకాల తెగుళ్లను ఎదుర్కోవడానికి మరియు కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఇది అనేక రకాలైన కీటకాలను సోకకుండా, అఫిడ్స్, త్రిప్స్ మరియు వైట్‌ఫ్లై ఆశించ కుండా చేస్తుంది.
మట్టి లో కలపచ్చు, నీటిలో కలిపి మొక్క పైనా స్ప్రే చేయచ్చు.
12.OWDC Bottle
80 రకాల బాక్టీరియా ఉన్న OWDC liqui మన గార్డెన్ లొ తరచూ వాడుతున్నట్లైతే ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు.
వివరంగా కావాలి అంటే పర్సనల్ గా msg చేయొచ్చు.
13.Neem Oil.
చాల రకాల పెస్ట్ లనీ తగ్గిస్తుంది.
నీటిలో డైల్యూట్ చేసి మొక్కల పైన స్ప్రే చేయొచ్చు, మట్టిలో కూడా ఈ నీటిని పోయవచ్చు