TERRACE GARDEN లో చీమల సమస్య – నివారణ చర్యలు
1. చీమలు గుంపులు గుంపులుగా, ఒకదాని వెనుక మరోకటి వరుసగా వెళ్తాయి. అవి వెళ్లే దారిలో ఒకరకమైన ఎంజైమ్ ను విడుదల చేస్తూ వెళ్తాయట వచ్చిన దారి మర్చిపోకుండా. కాబట్టి ఆ దారిలో అవి విడిచిన ఎంజైమ్ వాసనను మనం మార్చగలిగే, అవి దారి మర్చిపోయి వేరే చోటుకు వెళ్ళిపోతాయట. అలా చీమల దారి మళ్ళించవచ్చు.
—o0o—
నివారణ చర్యలు:
అవి వెళ్లే దారుల్లో ఘాటైన వాసన కల్గిన ఏదైనా పదార్థాలను powders or liquids రూపంలో తయారు చేసి చల్లితే, చీమలు ఆ దిశగా రాలేక దారి మళ్లించుకుంటాయి.
Powders:
(a) దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు, అవసరమైతే చీమల ఉదృతి బట్టి కారం కూడా కలిపి పొడి చేసి కుండీ లోని మట్టి లో చల్లాలి.
(b) పంచదార/ చెక్కెర ను Powder చేసి, దానిలో బేకింగ్ సోడా ను కలిపి చల్లాలి.
Liquids:
(a) వెనిగర్ ను కూడా వాడవచ్చు, కానీ సరియైన విధంగా వాడకపోతే మొక్కకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ( వద్దు)
2. ఇవి మీల్లీ బూర్గ్స్ విడుదలచేసే, sugar లాంటి పదార్థం కోసం మొక్క యొక్క కొమ్మల చివరి భాగానికి వీటిని చేరవేస్తాయి.
కనుక మొక్కల పై చీమలు కనిపిస్తే, అక్కడ మీల్లి బుర్గ్స్ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. తగిన రక్షణ చర్యలు తీసు కోవాలి.
—o0o—
నివారణ చర్యలు:
‘వంటాముదం’ ను ఒక బ్రష్ తో మొక్క క్రింది భాగం నుండి ఒక అడుగు పై వరకు కాండానికి దట్టంగా పూయాలి. అప్పుడు చీమల దారి మళ్లింప బడుతుంది. అయినా ముందుకి సాగితే ఆముదం యొక్క జిగటదనానికి అందులో చిక్కుకొని బయటకు రాలేక చనిపోతాయి. అలా చీమల ద్వారా వ్యాప్తి చెందే మిల్లీ బెర్గ్స్ నీ కంట్రోల్ చేయవచ్చు.
"సర్వేజనః సుఖినోభవంతు"
🌹🙏🏻🌹