51U2jXgfJ5L

వావిలి – Five leaved chaste tree (Vitex negundo) Benifits in Telugu

వావిలి
(సంస్కృతం: సింధువార )

ఆంగ్లం: Five-leaved chaste tree; 

హిందీ: Nirgundi

ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo).

వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు. పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు, గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
ఆయుర్వేద, సిద్ధ వైద్యంలో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణములు ఉన్నాయని, దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియాకు, కఫాన్ని తగ్గించడానికి ఉపయోగకరము.

వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.

వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.

పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది.

Sudhakar Palakurthy
Nutritionist
Organic farming.

Leaves available.
Free Supply to all our near and dear.

Shopping Cart