CTG కుటుంబ సభ్యులందరికి శుభాభినందనలు 30-1-2023
ఈరోజుతో (30-1-2023) నర్సరీ మేళా విజయవంతంగా ముగిసింది ..
నిన్న మన CTG ఆత్మీయ సమ్మేళనం 29-1-2023 ఆదివారం ఉదయం 9 గంటలకే 120 మంది సభ్యులు మన స్టాల్ 27 లో కనబడ్డం చూసి భానుకిరణ్ (హార్టికల్చర్ విభాగం స్టాఫ్ ) ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను అని చెప్పి ఎంతో సంతోషం అయిందని చెప్పినపుడు నాక్కూడా నిజాంగా హ్యాపీ గా అనిపించింది .
ఈ నర్సరీ మేళ CTG Meet హైలైట్ GREEN చామంతి , గ్రాఫ్టెడ్ కూరగాయల మొక్కలు . సభ్యులందరికి ఉచితంగా ఒక లీటర్ స్వచ్ఛమైన జీవామృతం , మునగ మొక్క Return Gifts
Grafted Plants కుప్పం , వైజాగ్ , అడ్డంకి ల నుండి వచ్చాయి . సుమారు 400 మందికి పైగా CTG సభ్యులు ముందే రిజిస్టర్ చేసుకొని ఉన్నందువల్ల చాల పద్దతిగా పంపిణి జరిగింది . ఈ పద్ధతి CTG ప్రత్యేకంగా రూపొందించుకొన్న స్వంత పద్ధతి . 2019 స్ట్రాబెర్రీ seasaon నుండి ఈ పద్ధతి క్రమం తప్పకుండ పాటిస్తున్న పద్ధతి . వైజాగ్ నుండి మొక్కలు రావటం ఆలస్యం అయింది అందువల్ల 11 గంటలకు పంపిణి కార్యక్రమం మొదలుపెట్టి నిర్విరామంగా సాయంత్రం 5 గంటల వరకు జరిగింది . ఈ పంపిణి కార్యక్రం లో CTG అడ్మిన్స్ & వాలంటీర్స్ పాల్గొని ఆర్డర్స్ పెట్టుకొన్న వారెందరిని పేరు పేరున పిలిచి వారికి గ్రీన్ చామంతి మొక్కలు , గ్రాఫ్టెడ్ మొక్కలు , నార్మల్ మొక్కలు ఇవ్వటం .. వీటితో బాటుగా ఉచితంగా ఒక లీటర్ స్వచ్ఛమైన జీవామృతం , మునగ మొక్క Return Gifts గ ఇవ్వటం పెద్ద Surprise
గత 3-4 సంవత్సరాలుగా ప్రతీ నర్సరీ మేళా లో CTG సబ్యులకు ఉచిత ప్రవేశం (Free Entry Passes ) ఇస్తున్న ఖాలిద్ అహ్మద్ గారికి CTG గ్రూప్ తరఫున కృతజ్ఞతలు . ఎదో 20 లేదా 30 రూపాయలు పెట్టుకోలేమని కాదు అదొక ప్రత్యేకమైన గుర్తింపు అనుకోండి ఒక ప్రత్యేక అనుకోండి . సుమారు 5000 కు పైగా Free Entry Passess ఇవ్వటం చాల గొప్పవిషయమే కాక CTG సమూహానికి గర్వ కారణం .
మనందరం కలిసి ఒక పండగ లాగ హాయిగా సంతోషంగా గ్రాఫ్టెడ్ మొక్కలు , గ్రీన్ చామంతి మొక్కలు , ఎన్నో రకాల కూరగాయల నారు ఒక పద్దతిలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం . కొంతమంది మన సభ్యులు నిన్న రాలేక పోయిన వారు కాల్స్ చేసారు , messages పంపారు ఈరోజు కూడా నర్సరీ మేళ ఫ్రీ పాసులు ఇవ్వగలరా ? అని . అలాంటివారికొరకు మీ CTG ఎల్లప్పుడూ ముందు ఉంటుందని మీ అందరికి తెలిసిన విషయమే అయినా మీతో share చేసుకోటానికి సంతోషం గ వుంది ఈరోజు కూడా మన వాళ్ళు ఎంతమంది CTG సభ్యులు వచ్చినా వారందిరికి CTG Nursery Mela FREE Pass ఇచ్చే ఏర్పాట్లు చేసాము
చాల కాలంగా మన సభ్యులు ఉభయ రాష్ట్రాలనుండి గ్రీన్ చామంతి కొరకు చాల అడుగుతున్నారు . ఈసారి తెప్పించి ఇచ్చాము ..ఆర్డర్ పెట్టుకొన్న వారిలో కొందరికి అందలేదు . ఇంకా చాల bright కలర్లు కూడా తెప్పిస్తున్నాము త్వరలో 20 కలర్స్ పైగా ఆర్డర్ పెట్టుకున్న వారు అందరికీ అందిస్తాము .
CTG Nursery Mela Meet లో జీవామృతం,, Dwarf ములగ మొక్కలు , 5 రకాలు కూరగాయలు నారు మొక్కలు, రిటర్న్ గిఫ్ట్స్ గా ఇచ్చాము
1. Green Chamanthi
2. Banthi Big Size Orange and Yellow
3. Red benda
4. Broccoli
5. Grafted sora
6. Grafted Tomato
7. Grafted Brinjal
హార్టికల్చర్ విభాగం వారు CTG తరపున మనము చేస్తున్న ప్రతీ కార్యక్రమాన్ని 2 సంవత్సరాలుగా బాగా గమనిస్తూ మనకు ప్రోత్సహహం కూడా బాగా ఇస్తున్నారు . వారు కూడా వంగ , టమాటో , కాలీఫ్లవర్ మొక్కలు మన సభ్యులకు 4000 కు పైగా అందచేశారు అవి మనసభ్యులకు ఉచితంగా ఇవ్వటం జరిగింది . అలాగే స్టాల్ 27 కూడా పూర్తిగా మనలను వాడుకోమని ఇవ్వడం కూడా వారి ఔదార్యానికి తార్కాణం . వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు .
700 members చాల ఉత్సాహంగా చురుకుగా పాల్గొని విజయవంతం చేసారు
-Harkara Srinivasa Rao: Founder : CTG Groups
https://cityofterracegardens.com