CTG INTERESTING POST

ఈమధ్య నాకు ఒక కొత్తరకం జబ్బు వచ్చిందని మా ఇంట్లో అందరూ అనుకుంటున్నారు.. వాళ్ళు అంటుంటే నాక్కూడా అనుమానం వచ్చింది సుమండీ.. ఇంతకీ ఏంటంటారా… పిచ్చఫ్ ప్లాంట్స్ అని.. తరతరాలు గా ఎందరికో వున్న పాత జబ్బే.. నాకు కొత్తగా వచ్చింది అనుకోండి.. ఇక్కడ గ్రూప్ లో ఆల్రెడీ ఈ జబ్బు ముదిరిపోయిన వాళ్ళు వున్నారని ఈమద్యే తెలిసింది.. దొంగతనాల కధలు చదివినప్పుడు.అర్ధం అయింది 🤭🤭😂😂
నాకైతే ఈ లక్షణాలు వచ్చాయండి.ఇదీ నా ప్రస్తుత పరిస్థితి ☺️. 👇..
ఇంట్లోనుంచి బయటకు వెళితే..దారంట మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి..అర్జునుడు కీ పక్షి కన్ను లాగా..అంటే మన ధ్యాస మొత్తం ఆటే వుంది మరి 🤭🤭.. ఎవరింటి ముందు ఏ ఏ మొక్కలు వున్నాయి.. అడిగితే ఇస్తారా ఇవ్వరా కొత్తరకం మొక్కలు ఏమైనా ఉన్నాయా ఇవి పీక్కెళ్ళి మనింట్లో పెంచుకుందామా.. అని ఒకటే ఆలోచనలు.. అంతేనా ఇంకా వుంది.. మావారు బండి డ్రైవ్ చేస్తూ ఏదైనా అడిగినా నాకు ఏది వినపడదు సదరు మొక్కల ధ్యాసలో.. ఫలితం మూడు తిట్లు ఆరు చివాట్లు.
బస్సు లోనో రైలు లోనో పోతుంటే కూడా ఇదే తీరు.. మీరు నమ్మరండీ.. గుంటూరు నుండి తెనాలి (మా పుట్టిల్లు) పోయే దారిలో ఏమేమి మొక్కలు ఎక్కడ ఉన్నాయో బాగా బట్టి పట్టేశానంటే నమ్మండి..ఏ ఊరు పోయిన ఇదే తంతు.. ఆమధ్య అత్తగారింటికి సత్తెనపల్లి వెళ్తే ఎదురింట్లో కొత్త మొక్కలు కనిపించాయి.. మా అత్త గారు నాకోసం వాళ్ళని అడిగి కొమ్మలు ఇప్పించారు.. ☺️☺️మావారు నావంక చూసిన చూపు మర్చిపోలేను.. ఆ.. అవన్నీ పట్టించుకోకూడదు 🤭🤭
రోడ్ మీద నడుస్తున్న, బండి మీద వెళ్తున్నా,రైలు బస్సు..ఎట్లా పోతున్న మొక్కలు గోలే..

ఇంకా నా ఫోన్ లో
యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ గార్డెనింగ్ ఛానెల్స్ (నేను సబ్స్క్రయిబ్ చేసుకున్నవి )🤗.. మరి నేను అవేగా చూసేది.. పిల్లలు ఎపుడైనా ఫోన్ తీసుకుని చూస్తే.. ఏంటమ్మా ఈ మొక్కల గోల అంటుంటారు..మా బాబు ఒక అడుగు ముందుకేసి ఎప్పుడు చూడటమేనా నువ్వు చేసేది ఏమైనా వుందా అని కూడా అడిగాడు 🙄
పౌరుషం కొద్దీ మొన్ననే మామిడి పళ్ళు కాస్త మిగలమగ్గితే బెల్లం కలిపి ఫర్టిలైజర్ చేసేసా.. ఆ డబ్బా పట్టుకెళ్లి మా ఇంట్లో ఖాళీగా వున్న రూమ్ లో దాచిపెట్టా.. మావారు ఆ డబ్బా చూసి ఏమోయ్ ఇక్కడేదో పచ్చడి డబ్బా మర్చిపోయావోయ్ పట్టుకెళ్లి వంటింట్లో పెట్టుకో అన్నారు 😬.. అది "fachadi" కాదు డాడీ..మమ్మీ మొక్కలు కోసం చేసిన జ్యూస్ అని మా పిల్లలు.. 🤦‍♀️ఇలా సాగుతోంది అండీ మా ఇంట్లో.. ఇప్పటికే చాలా చెప్పాను.. ఇంకా బోలెడు వుంది చెప్పాల్సింది.. మరోసారి చెప్తాను అండీ..🙏🏻

RAGALATHA
Ctg guntur.

Shopping Cart