ఆరు లీటర్ల పాలు తీసుకొని వేడి చేసి చల్లారిన తరువాత మీగడ తీసివేసి పాలలో తోడు అంటె పెరుగు సుమారు అర లీటరు పైన వేయండి మూడు రోజుల తరువాత ఇది పుల్లగా తయారు అవుతుంది ఇందులో ఆరు లీటర్ల నీరు పోసి మజ్జిగ తయారు చేయాలి మొత్తం పన్నెండు లీటర్లు తయారు అవుతుంది దీనిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి ఇందులో మూడు వందల గ్రాముల పసుపు పొడి కూడా కలిపి స్ప్రె చేసుకోవాలి (పసుపు పొడి కొన్నది కాకుండా పసుపు కొమ్ముల తొ ఇంట్లో తయారు చేసుకోవాలి)