గుడ్ మార్నింగ్, ఫ్రెండ్స్, కుండీలో లో మొక్క ల వేరు లలో చీమలు చేరిపోతున్నాయి. వాటివల్ల కొన్ని మొక్క లు ఎదుగు దల లేదు. నేను వేసవి కాలం లో గానుగ ఆకులు మట్టి కలిపి ఉంచాను, వాటిలో చలి చీమలు, గుడ్లు ఉంటున్నాయి. పసుపు వేసాను. కరెంటు చీమలు కూడ మాకు ఎక్కువ నివారణ చెప్పండి చీమల మందు వేస్తే అని చేనిపోతాయి, ఏదో పాపం అనిపిస్తున్నది. మహేశ్వరీ పెసల CTG కాకినాడ
నివారణ : చీమల బెడద వున్నపుడు…
1.ఎనిమిది టేబుల్ స్పూన్ల చక్కెర మరియు సగం టేబుల్ స్పూన్ బోరాక్స్ కొద్ది వేడి నీళ్ళలోవేసి బాగా కరిగించి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. దీనిలో కాటన్ బాల్స్ నానబెట్టి, చీమల బెడద ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉంచండి.
2.ఒక చిన్న కాటన్ బాల్ తీసుకుని అందులో 2 -3 చుక్కల లెమన్ యూకలిప్టస్ ఆయిల్ వేయండి.
మీరు తరచుగా చీమలు చూసే ప్రాంతాల్లో ఈ బంతులను ఉంచండి.
3.ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్+ గ్లాస్ క్లీనింగ్ స్ప్రే+ నీటిని కలిపిబాగా షేక్ చేసి, ఆపై చీమల దగ్గర మరియు ఎంట్రీ పాయింట్లపై పిచికారీ చేయండి.
4.వేప నూనె మొక్కల చుట్టూ స్ప్రే చేయ్యడం వలన చీమలు చేరడం తగ్గుతాయి.
వర్షాకాలంలో నెలకు ఒకటీ రెండుసార్లు చేయండి.
5.సుద్దతో కుండీల అంచులమీద, చుట్టూ గీతలు గీయండి.సుద్దలో ఉండే కాల్షియం కార్బోనేట్ చీమలకు నిరోధకంగా పనిచేస్తుంది.
6.మిరియాలపొడి,దాల్చినచెక్కపొడి,పసుపు కలిపి చల్లోచు..
-మునిప్రసాద్ CTG రాజమండ్రి