CTG సభ్యులందరికీ శుభకకృత నామ సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా CTG ప్రస్థానం గూర్చి గుర్తు చేసుకుందాం.
మొదట శ్రీనివాస్ హరకర గారు October 2019 లో స్ట్రాబెర్రీ వాట్సాప్ గ్రూపు ప్రారంభించి హైదరాబాద్ లో స్ట్రాబెర్రీ 🍓 పెంచాలనుకునే గ్రూప్ సభ్యులకు మొక్క కేవలం 15 రూపాయలకే పూనా నుండి తెప్పించి అందజేసి మొక్కలు పెంచాలనే కోరికని మొలకెత్తేలా చేయడమే కాకుండా ఫామ్ విజిట్స్ ఏర్పాటు చేసి సభ్యులు తమ అభిప్రాయాలను మరియు విత్తనాల ను పంచుకునే అవకాశం కల్పించారు.
క్రమం గా స్ట్రాబెర్రీ వాట్సాప్ గ్రూపు సిటీ ఆఫ్ టెర్రేస్ గార్డినర్స్ గ్రూప్ గా పేరుమార్చుకుని ఎంతోమంది ఔత్సాహికులకు సభ్యత్వాన్నిచ్చింది.
2020,2021 కరోనా కాలంలో ఫామ్ విజిట్స్ ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ ఆ సమయంలో అందరూ టెర్రేస్ గార్డెన్స్ కి మొగ్గు చూపడంతో, CTG కరోనా కంటే వేగంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఎంతోమందిని సభ్యులు గా చేర్చుకుని, కొత్త గ్రూప్ లు ఏర్పాటు చేసి అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు ఇప్పిస్తూ హైదరాబాద్ లోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ర్టాలలో గ్రూపులు ప్రారంభించి ఇంటింటా మిద్దెతోటల పెంపకం లో సభ్యులు సఫలీకృతంమయ్యేలా ప్రోత్సహిస్తున్నారు.
కరోనా తగ్గటం తో 2021 ఆఖరులో ఫామ్ విజిట్స్, టెర్రెస్ గార్డెన్ విజిట్స్ ఏర్పాటు చేసి నూతనోత్తేజాన్ని పెంపొందిస్తున్నారు.
CTG నేడు మహావృక్షం గా మారి శాఖోపశాఖలుగా విస్తరించడంలో శ్రీనివాస్ హరకర గారితో పాటు అడ్మిన్ సరోజ గారు అహర్నిశలు చేస్తున్న కృషి అమోఘం.
CTG వృక్షం అంతా దృఢంగా, అన్ని శాఖలతో ఉందంటే అలా వృద్ధి చెందడానికి పైకి కనిపించని బలమైన వేరువ్యవస్థ ముఖ్యభూమిక పోషిస్తుంది. సరోజ గారు ఒక బలమైన వేరు వ్యవస్థ గా వుంటూ చిరునవ్వుతో CTG ని ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు. వాలంటీర్లు తమ ఇంటి శుభకార్యం లా ctg ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేస్తున్నారు.
గ్రూప్ లో ఒక మెంబర్ సలహా కోరగానే అందరు సభ్యులు తాము ఇవ్వగల సలహాలను ఇవ్వడం, సభ్యలందరి సమస్యలకు అడ్మిన్ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని సభ్యులకు అందజేయడం …ఒక్కరికోసం అందరూ..అందరికోసం ఒక్కరు..అనే విధంగా పనిచేసి CTG ప్రగతి పధం లో దూసుకు పోతోంది.
ఈ శుభకృత నామ సంవత్సరం CTG వ్యవస్థాపకులు, అడ్మిన్స్ కు, వాలంటీర్లకు, అన్ని గ్రూపుల సభ్యులకు శుభప్రదంగా వుండాలని, అందరూ స్వయంసమృద్ధిగా ఇంటి పంటలను పండించు కోవడంలో CTG ఎల్లవేళలా సలహాలు ఇస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ…..
…. పద్మ సుందరి