Chrysanthemum

చామంతి చెట్లకు తీసుకోవలసిన జాగ్రత్తలు:

పాటింగ్ మిశ్రమం: 50% ఎర్ర మట్టి, 30% ఏదైనా కంపోస్ట్, 10% ఇసుక, 10% వేప పొడి.

ఎరువులు: మొక్కల పెరుగుదల కోసం జీవామృతం, పువ్వుల కోసం అరటి ద్రవం, ఆవా కేక్ ద్రావనం, వాడిన కాఫీ పొడి వాడవచ్చు.
తెగులు నివారణ: వీటికి ఎక్కువ నల్ల అఫిడ్స్, మిలిబగ్స్ దాడి చేస్తాయి. బ్లాక్ అఫిడ్స్ వస్తే మొక్కని సాదా నీళ్లతో కడిగి, చెక్క బూడిద, పసుపు పొడి కలిపి మొక్కల మీద చల్లితే కంట్రోల్ అవుతాయి.
నల్ల మచ్చ తెగులు చమంతి మొక్కలపై దాడి చేస్తాయి. ఈ సమస్య నివారణకు బేకింగ్ సోడా 5mg + white vinegar 5ml + neem oil 5ml + కుంకుడు పొడి 5gm + 1 lt నీళ్ళల్లో కలబెట్టి వారానికి ఒకసారి పిచికారి చేయండి.
ఎక్కువగా మిబుగ్స్ ని చూసినప్పుడే చేతితో తీసేయడం మంచిది. ఎక్కువ వున్నట్లైతే పాత టూత్ బ్రష్ తో తుడిచేసి నీమ్ ఆయిల్ స్ప్రే చెయ్యాలి.

CTGian
PADMINI

Shopping Cart