Leaf Curl – Precautions and Resolutions

ఆకు ముడత నివారణ

* ఆకు ముడత అనేది మనం ఎక్కువ గా మిరప, టమాటో, మిగతా కొన్ని ఆకుకూర కూరగాయలు మొక్కల్లో చూస్తుంటాము.
* ఈ ఆకు ముడత లో రెండు రకాలు ఉంటాయి,
– ఆకులు పైకి ముడుచుకోవడం
-.ఆకులు కిందకి ముడుచుకోవడం.
* ఆకు ముడత రావడానికి ముఖ్య కారణాలు :-
– మొక్కకి నీరు తక్కువ అయినా
– మొక్కకి నైట్రోజెన్, పోటాషియమ్, ఫోస్పోరస్
తగ్గినా
– ఎండ వేడి ఎక్కువ అయినా కానీ మొక్కలో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి ఆకు ముడుచుకుంటుంది.
* ఆకు ముడత ఎక్కువ గా టమాటో మొక్కల్లో బాగా కనిపిస్తుంది అందుకే టమాటో మిరప మొక్కలని పక్క పక్కన ఉంచకూడదు.
* ఈ ఆకు ముడత నివారణకు తీస్కోవలసిన జాగ్రత్తలు
* పొట్టు తీసిన వెల్లుల్లి – 100gms
* పెరుగు – 100gms
* ఇప్పుడు వెల్లుల్లి, పెరుగు ని తీస్కుని మిక్సీ లో మెత్తగా phaste లా పట్టేసి ఒక పాత్ర లోకి తీస్కుని దానికి 2 లీటర్ల నీళ్లు కలపాలి.
* ఈ పాత్ర కి ఒక కాటన్ cloth తో మూసి నీడ లో ఒక 7 రోజులు ఉంచాలి.. రోజూ కలపాల్సిన పనేమీ లేదు.
* ఏడు రోజుల తర్వాత ఈ మీశ్రమం బాగా fermentation అవుతుంది. ఇది చాలా చాలా ఘాటుగా ఉంటుంది.
* ఇప్పుడు దీన్ని ఇంకో బాటిల్ లోకి వడకట్టుకోవాలి.. ఇది ఒక నెల వరకు నిలవ ఉంటుంది.
* దీనిలో మళ్ళీ నీళ్లు ఏమి కలపాల్సిన అవసరం ఉండదు ఈ ద్రావనాన్ని స్ప్రే బాటిల్ లో పోస్కుని మొక్కలకి direct గా వారానికి 2 సార్లు స్ప్రే చేయాలి ( ఆకు ముడత ఎక్కువ గా ఉంటే )
* నెల నుండి రెండు నెలల్లో 100% result కనిపిస్తుంది.
Thank you
Srinivas khammam

Shopping Cart