PEST CONTROL POWDER

Pest control powder : అంటే మనకు అందుబాటులో ఉండేవే.
బూడిద, వేపపిండి, పొగాకు, ముద్ద ఇంగువ, కర్పూరం, లవంగాలు, పసుపు, కొంచెం పొడిసున్నం. ఇవే వాడినవి.
పొగాకు, ఇంగువ, లవంగాలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
వేప పిండిని, బూడిదని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి
అలాగే మిగతా వాటిని 10% మాత్రమే తీసుకోవాలి
ఇలా మొత్తం ఎండబెట్టుకున్న తర్వాత వాటిని పొడి చేసుకోవాలి.
పొడి చేసుకొని మనం పిండి జల్లించుకునే జల్లెడ ద్వారా పిండిలాగా జల్లించుకోవాలి దాన్ని మనం ఏదైనా బాటిల్లో పోసుకొని పైన చిన్న హోల్స్ పెట్టుకొని రెడీ చేసుకోవాలి.
ఇలా రెడీ అయిన పౌడర్ని మనం ఎప్పటికప్పుడు ఎక్కడ pest కనబడితే అక్కడ చల్లొచ్చు
అలాగే వేర్లకి ఏమన్నా ప్రాబ్లం ఉందని తెలిసినా కానీ అక్కడ కూడా చల్లచండి.
ఈ పౌడర్ చల్లడం వల్ల మొక్కలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి హాని జరగదు.
బాటిల్స్ హోల్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ప్లాస్టిక్ కవర్ తోటి రబ్బర్ బ్యాండ్ లేదా తాడుతో మానేసి సీల్ వేసుకోండి
లేకపోతే ఈ పౌడర్ యొక్క పవర్ పోతుంది.
ఇలా సీల్ చేసుకున్నందువల్ల మనకి ఎక్కువ కాలం ఉపయోగంగా ఉంటుంది.
పౌడర్ చేసుకోగా మిగిలిన మిశ్రమాన్ని మన మొక్కలు పెట్టుకునేటప్పుడు వేప పిండికి బదులుగా దీన్ని కలుపుకుంటే అందులో pest చాలా తక్కువగా వస్తుంది. ఇది అయితే నేను గమనించాను.
ఈ పౌడర్ ని మనం కొంచెం నీడ ఉన్న ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి ఇది దగ్గర దగ్గర ఆరు నెలల వరకు పనిచేస్తుందండి. నేనైతే గత ఆరు నెలల నుండి ఇలాగే వాడుతున్న. ఈ పౌడర్ వల్ల నాకు చాలా ఉపయోగంగా ఉంది.

Shopping Cart