టెర్రస్ గార్డెన్ లో అల్లం సాగు చేయాలంటే ముఖ్యంగా మనకి సాయిల్లో ఇసుక శాతం ఎక్కువ ఉండాలి. అలాగే కుండీకి డ్రైనేజీ హోల్స్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అల్లం అనేది దుంప జాతి మొక్క కాబట్టి దానికి ఎక్కువగా నీరు ఉండకూడదు. అల్లం నాటుకునేటప్పుడు ముఖ్యంగా మనం నాణ్యమైన మరియు చిన్న మొలక ఉన్న దుంపను తీసుకుంటే గనుక అల్లం మొక్క బాగా ఎదుగుతుంది. అల్లం దుంపని నాటే ముందు మనం ట్రైకోడెర్మా గాని సుడోమోనాస్ కలిపిన నీళ్లల్లో ఒక ఐదు నిమిషాలు, పది నిమిషాలు నానబెట్టి నాటితే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మట్టిలో హాని చేసే సూక్ష్మజీవులు చనిపోయి దుంప మొలకెత్తి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్క ఎదుగుదలను బట్టి మనకి అందుబాటులో ఉన్న ఎరువుని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. దుంప జాతి మొక్కలకి పూర్తిగా తయారైన ఎరువును మాత్రమే ఇవ్వాలి. లేకుంటే ఎరువుల్లో ఉండే పురుగుల వల్ల దుంపకి హాని కలగవచ్చు. పై మొక్క పూర్తిగా ఎండిన తర్వాత మనం అల్లం తీసుకుంటే మనకి ముదురు మరియు నాణ్యమైన అల్లం వస్తుంది తొందర పడితే లేత అల్లం వస్తుంది అది ఎక్కువగా నిల్వ ఉండదు. అల్లం మట్టిలో తయారైన తర్వాత వెంటనే తీయాలని ఏమీ లేదు అది కొన్నాళ్ళు మట్టిలో ఉంచిన పర్వాలేదు అల్లం చాలా ఆరోగ్యంగా ఇంకా కొంచెం సైజు ఊరే అవకాశం ఉంది. అల్లం మొక్క ఎదుగుతున్న దశలో కింద ఆకుల్ని కట్ చేసి మనం టీలో వేసుకొని వాడుకోవచ్చు.
Courtesy: Syam Prasad
CTG Member
Container adi tisukunta better ga vuntundi
Very good information