Kitchen Waste – Compost + Liquid

కిచెన్ వేస్టు తో – లిక్విడ్ + కంపోస్టు

కిచెన్ వెస్టు పాత్రలో పోసి దానిలో బియ్యం, పప్పు, కూరలు, పండ్లు కడిగిన నీళ్ళు కూడా దానిలోనే పోసి నానబెట్టాలి. అన్ని రకాల పండ్ల తొక్కలతో చేయవచ్చు. నిమ్మ, నారింజ మాత్రం (పులుపు వుండేవి) చేయవద్దు. పులిసిన మజ్జిగ కొంచెం వేసి రోజూ కలుపుతూ వుండాలి. 3days తర్వాత వడకట్టి ఆ నీటికి, 5 బాగాల నీరు కలిపి చెట్లకు (కుండి) అన్ని రకాలకూ కొంచెం చొప్పన పోయండి. ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఒలంగా ఎదుగుతాయి.

వడకట్టిన చెత్తని ఎండ బెట్టి. దాన్ని కంపోస్ట్ బిన్ లో తీసుకొని మట్టిని చల్లండి. మద్యలో ఎండిపోయిన ఆకులు పొరలుగా వేయండి. వేసిన ప్రతిసారి మట్టి ఖచ్చితంగా వేయాలి. మట్టి లేకుండా కంపోస్టు త్వరగా తయారు కాదు. మట్టివుంటే పురుగులు కూడా రావు.

వారానికి ఒకసారి, పుల్ల మజ్జిగ కాని, పేడనీళ్ళు కానీ, డీకంపోజరు నీళ్ళు ఏదో చల్లండి. మూత తప్పనిసరిగా వుండాలి. గాలి వెళ్ళడానికి చుట్టూ రంద్రాలు తప్పని సరిగా పెట్టాలి. కొంచెం వెలితిగా (Bin) వున్నపుడు నిండా మట్టి (కలిపి) వేసి మూత పెట్టి 1 నెల తర్వాత తీసి వాడుకోండి. పొడి చెత్త అయితే:- ఎప్పటికప్పుడు చెత్తిని కిచెన్ వేస్టు కుళ్ళబెట్టి మధ్య మధ్యలో ఆకు, మట్టి చల్లుతూ వారానికి ఒకసారి పైన చెప్పిన విధంగా చల్లండి. నిండే దాకా అలావుంచితే 13 ల తయారవుతుంది. పొడి చెత్త వేసిన బిన్ కి అడుగున కూడా పెద్ద రంద్రం చేసి దాని క్రింద పాత్ర పెట్టి లిక్విడ్ వచ్చినపుడు 10: 1 (నీరు + లిక్విడ్ కలిపి సాయంత్రం చెట్లకి ఇవ్వాలి.

Shopping Cart