మనం మిత్ర పురుగులా వుండే శత్రు పురుగు గురించి తెలుసుకుందాం..అక్షింతల పురుగు లా ఉంటుంది.. కానీ ఇది అక్షింతల పురుగు లా మొక్కలకు మంచి చేయదు..
ఇది మన పంటలను ఆశిస్తే కాడలు , ఈనెలు తప్ప మొక్క మీద ఇంకేమీ మిగలవు..
అదే ఎపిలక్నా జాతి….దీనిలో కొన్ని రకాల బీటిల్స్ ఉంటాయి..
వాటిలో మెక్సికన్ బీన్ బీటిల్ లేదా ఎపిలక్నా వేరివిస్టిస్ అనే బీటీల్ (పెంకు పురుగు లు ) గురించి తెలుసుకుందాం..
ఇవి వంగ , మిరప , టమోటా , పొటాటో లాంటి మొక్కలను , తీగ జాతి మెక్కలను , చిక్కుడు జాతి మొక్కల ను ఆశించి వాటిని నష్టపరుస్తాయి..
ఇవి చేసే నష్టం చాలా ఉంటుంది.. ఆకుల మీద ఉన్న పత్రహరితాన్ని మొత్తం తినేసి..ఆకును అస్థిపంజరం లా చేస్తాయి..
ఇవి మొక్కను ఆశించి నప్పుడు చూసి వెంటనే నివారణ పద్ధతులు పాటించాలి..
1 . వేప కషాయాన్ని,లేదా నీమాస్తరం లేదా వేపనూనె ను పిచికారి చేయాలి..
గుడ్డు దశ లోనే వీటిని పిచికారి చేస్తే అవి నాశనం అవుతాయి..
గుడ్ల నుంచి వచ్చే క్రిములు కషాయాలతో కొంత వరకే నాశనం అవుతాయి..
పచ్చిమిర్చి , వెల్లుల్లి కషాయం..ధశపర్ణి కషాయం , గో మూత్రం లాంటివి ప్రాధమిక దశలో పనిచేస్తాయి..
2 .మెటరైజమ్ అనిసోప్లే అనే ఫంగై బాగా పనిచేస్తుంది..
బాసిల్లస్ తురింగిజెనిసిస్ ( Bt ) , ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ (ఇపిఎన్) ఇవి కూడా బాగా పనిచేస్తాయి..
3 .హైడ్రోజన్ పెరాక్సైడ్ 30 శాతం ఉన్నది..లీటరు నీటికి 10 ఎంఎల్ ..60 శాతం ఉన్నది లీటరు నీటికి 5 ఎంఎల్ కలిపి.. దానికి డిష్ వాష్ సోపు కానీ.. కుంకుడు కాయ రసం కానీ కలిపి.. వేపనూనె కూడా కలిపి పిచికారి చేయాలి..
4 . 3 ml వైట్ వెనిగర్ , 3 గ్రా వంట సోడా , 5 ml వేప నూనె , 3 ml డిష్ వాష్ సోపు కలిపి పిచికారి చేయాలి..
5 . లీటరు నీటిలో 3 ఎంఎల్ డిష్ వాష్ సోపు కలిపి వేగంగా పిచికారి చేయాలి..ఇది ప్రాధమిక దశలో పనిచేస్తుంది.. కానీ మరల రాకుండా రెండు రోజుల కు ఒకసారి చేస్తూ ఉండాలి..
6 .వేపనూనె , డిష్ వాష్ సోపు కానీ కుంకుడు కాయ రసం కానీ కలిపి పిచికారి చేయాలి..
ఈ విధంగా ఏదో ఒక పద్ధతి ఉపయోగించి దీనిని నివారించవచ్చు..
–Courtesy : లత మిద్దెతోట