SAPTHA DHANYANKURA DRAVANAM సప్తధాన్యాంకుర ద్రావణం

SAPTHA DHANYANKURA DRAVANAM సప్తధాన్యాంకుర ద్రావణం

తయారీకి కావల్సినా పధార్ధలు :

నువ్వులు 100 గ్రాములు,
పెసలు 100 గ్రాములు,
మినుములు 100 గ్రాములు,
ఉలవలు 100 గ్రాములు,
బొబ్బర్లు (అలసందలు) 100 గ్రాములు,
శెనగలు 100 గ్రాములు,
గోధుమలు 100 గ్రాములు.

తయారీ:
వీటన్నంటినీ మొలకలు వచ్చేలా తడిగుడ్డలో కట్టుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత తీసి రోటి పచ్చడిలా రుబ్బుకోవాలి.

200 లీటర్ల నీళ్ళు, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం కలిపిన డ్రమ్ములో ఈ పచ్చడిని వేసి 24 గంటలపాటు నీడలో ఉంచి మూడుపూటలా 3 నిముషాలపాటు కుడివైపునకు తిప్పాలి.

తర్వాత గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే పంటల నాణ్యత పెంచే ద్రావణం.
ఉపయోగాలు :
ఇది పంటల నాణ్యత పెంచే ద్రావణం

పంటను కోసే 2 లేదా 3 వారాల ముందుగా ఈ ద్రావణాన్ని 1 ఎకరం పంటపై పిచికారీ చేస్తే గింజల్లో తాలు ఉండదు.

సప్తధాన్యంకురా ద్రావణంను నేరుగా మొక్కల మీద పువ్వులు మొగ్గ దశలో కానీ లేదా గింజలు మొదటి దయ అంటే గింజలు పాలు పోసుకునే దశలో పిచకారిగా ఉపయోగించవలెను. ఇలా చేసినచో పండ్లు , కాయలు నాణ్యత పెరిగి అధిక దిగుబడినిస్తాయి .

ఈ ద్రావణం ఒక ఎకరానికి సరిపోతుంది.
Note: దినిని 48 గంటల లోపే ఉపయోగించాలి

Shopping Cart