Beginner guide to (Middethota) Terrace Garden.
Leafy vegetables setup and preparation
Hello plant lovers here we explained How to start with Middethota Terrace Garden begging guide for leafy vegetables in telugu
#Terracegarden #balconygarden #backyardgarden #frontyardgarden #మిద్దెతోట తయారీ విధానం : ఆకుకూరలతో ఆరంభం…
- మీరు 4-5 కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. వెడల్పు ఎక్కువ, ఎత్తు తక్కువ ఉండే కుండీలు/ట్రేలు/మడులలో ఆకుకూరలు ఎంచక్కా సాగు చేయొచ్చు. మొదట..
- ఎర్రమట్టి, చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి. కొబ్బరి పొట్టు, వేపపిండి కొంచెం కలిపితే మంచిది.
- కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి ఈ బెజ్జం(hole) పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం).
- ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి. .. నీరు sprinkler తో ఇవ్వండి.. అంతే… మెంతి కూర చాల త్వరగా మొలకెత్తుతుంది .. ఆలస్యం ఎందుకు ట్రై చేయండి.. (కొత్త gardnerers కు మాత్రమే సుమా)..