మిర్చి, పత్తి మరియు కూరగాయల రైతులు సమగ్ర సస్యరక్షణ లో తీసుకొనవలసిన ముందస్తు జాగ్రత్తలు .
,*విత్తన సేకరణ లోనే తగిన జాగ్రత్తలు వహించాలి. నాణ్యమైన బ్రాండెడ్ ప్యాకెట్ పైన బార్కోడ్ గలవి కొనాలి. వాటి ఇ రశీదు భద్రపరుచుకోవాలి.
పూర్తిగా గా సేంద్రియ వ్యవసాయము చేసుకుంటే లాభ పడతాము .మనమే స్వయముగా అమృత ద్రావణము తయారుచేసుకుని విత్తనశుద్ధి నుండి వాడుకోవాలి.
*చీడపీడల కు సూక్ష్మ జీవన క్రిమిసంహారకాలు ఆరు రకాలు మన మన వంటింటిలో తయారుచేసుకుని తరచుగా పిచికారి మరియు నేలకు ఇవ్వాలి. సూక్ష్మజీవ న ఎరువులు పన్నెండు రకాలు ఇంటిలో తయారుచేసుకుని నేలకు ఇవ్వాలి. తోట లోMycorrhiza( VAM) పెండ కుప్ప పైన తయారుచేసుకుని దాన్ని కూడా ఇవ్వాలి.
*అమృత ద్రావణాన్ని విత్తన శుద్ధి లో పూత ,పిందే,కాయ దశలో పిచికారి చేస్తే ఎలాంటి చీడపీడలు వైరసులు రావు. తరచుగా అమృతద్రవణం ఇస్తే సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, micronutrients తగుపాళ్లలో మొక్కలు ముల్డర్ చార్ట్ ప్రకారంగా తీసుకుంటాయి . రసాయన వ్యవసాయం కంటే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
ముందస్తు జాగ్రత్త వల్ల గులాబి రంగు పురుగు,కాండం తొలుచు పురుగు, కాయతొలుచు పురుగు, వేరు కుళ్ళు,కాండం కుళ్ళు మొదలగు చీడ పీడలు తట్టుకుని రోగనిరోధక శక్తిని పెంచుకుని మిరప ఆకులకు పై ముడత కింది ముడత మొదలగు వైరస్ తెగులు కూడా అరికట్టబడతాయి.
☠️ రైతులు ఫెర్టిలైజర్స్ షాపుకు వెళ్లకుండానే డబ్బులు ఆధా చేసుకోవచ్చు.
అన్ని పంటలలోప్రధానంగాసోకే పురుగులతెగుళ్లు
1.Red mite = ఎర్ర నల్లి ద్వారా = క్రింది ముడత
- Thrips = తామర పురుగుల ద్వారా = పై ముడత
- White fly = తెల్ల దోమ ద్వారా = జెమిని వైరస్/leaf curl virus
- Colletotrichum fungi ద్వారా = కొమ్మ ఎండు తెగులు, కాయ కుళ్లు తెగులు
- Coniophora fungi ద్వారా = కొమ్మ కుళ్లు తెగులు/ బూజు తెగులు
- పేను బంక అంటే mealy bug ద్వారా = Mosaic virus
- fusarium fungi లేదా phytophthora లేదా fungi లేదా verticillium fungi లేదా psudomonas solanaciarum bacteria ద్వారా = Wilt = వేరు కుళ్లు లేదా వడల తెగులు
- Midze fly ద్వారా = గుండు పూత
- Chilli Spodoptera = పొగాకు లద్దె పురుగు
- Powdery mildew = బూజు తెగులు = సిలింద్రాల ద్వారా
- Bacterial fruit rot = Erwinia bacteria ద్వారా
- Fruit rot by calcium deficiency = బెట్ట ద్వారా లేదా ఎక్కువ నీళ్లు పెట్టడం ద్వారా కలుగుతుంది
- Yellow Leaf by Nutrient deficiency = పండాకు = పోషకాల లోపం ద్వారా కలుగుతుంది.
- ఆకుమచ్చ తెగులు = Cercospora fungi ద్వారా లేదా bacteria ద్వారా. ⚛️ నివారణ ఆరు రకాల EPFs, బవేరియా,verticillsm, మెటారీజాం, ట్రైకోడెర్మా, BD500,ఇసారియలు NSKE50000ppm/సీతాపల్,కానుగ, వేప నూనెలతో కలిపి ఒక్కొక్కటి ఒక లీ. చొప్పున 200లీ. నీటికి కలిపి తరచుగా అంటే మూడాకుల దశ, పూత, పిందె, కాయ,పండు దశలలో పిచికారి చేసుకుంటే ఎలాంటి చీడ-పీడలు సోకకుండా మంచి నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు
This site is very much useful for me to grow my garden.