ట్రైకోడర్మా, మెటారైజమ్, బవేరియా, వర్టిసెల్లం, సుడోమోనాస్ ,

ట్రైకోడర్మా, మెటారైజమ్, బవేరియా, వర్టిసెల్లం, సుడోమోనాస్ , ఇవన్నీ మొక్కలకు వ్యాదులు సోకకుండా రక్షణ కవచంలా మొక్కల వేరు వ్యవస్థ ను కాపాడుతూ వుంటాయి.
అజటోబ్యాక్టర్ ,అజోస్పెరిల్లం ,రైజోబియం మైకోరైజా ఇవి బ్యాక్టీరియా సంబంధమైనవి.ఇవి ధాన్యం, పప్పుల నాణ్యతను పెంచడానికి ఉపయాగపడతాయి.ఇవి వేరు వ్యవస్థ పై కవచంచంలా ఏర్పడటమే కాకుండా మొక్కలకు కావలసిన ఆహారాన్ని ఆక్సిజన్ ను అందిస్థాయి.
జింక్,పొటాషియం, సల్ఫర్, వంటి సూక్ష్మ పోషకాలను మొక్కలకు కావలసిన రూపంలోకి మార్చి అందించే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి.
అంటే ఉదాహరణకు మనం ఆహారం తీసుకుంటే ఆ ఆహారాన్ని జీర్ణం చేసే రసాయనాలన్నమాట.
ఇదంతా బాగానే వుంది మరి రక్షణ వ్యవస్థ, ఆహారాన్ని జీర్ణం చేసే బ్యాక్టీరియా లు అన్నీ భూమిలో ఉన్నాయి మరి ఆహారం విషయానికి వస్తే అదీ భూమిలో వుంటుంది కాబట్టే అడవిలో చెట్లు పెరుగుతున్నాయి కాయలు కాస్తున్నాయి.కానీ వ్యవసాయక భూమిలో అధిక సాంద్రత లో మొక్కలు పెంచవలసిరావడం వల్ల సహజ సేంద్రీయాన్ని ఆహారంగా భూమిలోకి చేర్చవలసివుంటుంది.
ఇన్ని చేసినా ఆరోగ్య కరమైన మనుషులకు అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి జలుబు ,జ్వరం, చిన్నచిన్న ఎలర్జీలు వచ్చినట్లే కొన్ని రకాల వ్యాధులు మొక్కలకూ రావచ్చు సహజంగానే భూమినుండి పొందే వ్యాధినిరోధక శక్తివలన చాలా రకాల వ్యాధులు మొక్కలకు రావు వచ్చినా తట్టుకుంటాయి.వేపనూనె,సుడోమోనాస్ వంటివి ఉపయాగించి నివారించుకోవచ్చు .సహజ వ్యాధినిరోధక శక్తి ఉన్న
మనుషులు కరోనాను సైతం తట్టుకున్నట్లే మొక్కలు కూడా అనుకోకుండా దాడిచేసే వైరస్ లను
తట్టుకోగలుగుతాయి.
అధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడులను అందించగలుగుతాయి.
ట్రైకోడర్మా, మెటారైజమ్, బవేరియా, వర్టిసెల్లం
ఇవన్నీ భూమిలో సహజంగానే ఉండేవి అయితే గత కొన్ని దశాబ్దాలుగా రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూమిలో ఇవన్నీ నశించిపోయే స్థాయిలో వున్నాయి. ఇవి లేకపోవడం వల్లనే భూములు ఎడారులుగా మారిపోతాయి.ఇప్పుడు మనం పండించే పంటలు భూమిని ICU లో ఉంచి మందులు ఆక్సిజన్ ఇచ్చి పేషంట్ ను బతికించే ప్రయత్నంలో అనేక మందులు వాడుతున్నాము. అవి వికటించి కొత్త జబ్బులు వస్తున్నాయి. వాటిని నివారించడానికి ఇంకొన్ని కొత్త మందులు వాడుతున్నాము.ఈ క్రమంలో భూమీ ,మొక్కలు రెండూ సహజమైన రోగనిరోధక శక్తిని కోల్పోయి కృత్రిమ రసాయనాలు వాడవలసివస్తుంది.
అలాంటి భూములలో పండే ఆహార పదార్థాలను ఆహారం గా స్వీకరించడం వల్లనే ఇప్పుడు మనుషులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలకారణం.

దేశం అభివృద్ధి చెందాలని అందరం కోరుకుంటాము కానీ దేశ జనాభాలో అరవై ఐదు శాతం ఉన్న రైతు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనేది ఎవరూ పట్టించుకోరు.
రైతు బాగుపడలంటే భూమి బాగుండాలని – భూమి బాగుండాలంటే సేంద్రీయ, ప్రకృతి, వ్యవసాయ విధానాలను అనుసరించడమే సరైన విధానమని రైతు గుర్తించడంలేదు*

లక్షలు ఖర్చు చేసి రసాయనాలతో దిగుబడులు సాధించే రసాయనిక వ్యవసాయ విధానాల కన్నా అతి తక్కువ ఖర్చుతో అంతటి దిగుబడులు సాధించవచ్చని అనేకమంది రైతులు ప్రయాగాత్మకంగా నిరూపిస్తున్నా ప్రభుత్వాలు ప్రోత్సాహించడంలేదు.రైతులు అర్దం చేసుకోవడం లేదు.

Shopping Cart