టమాటా మొక్కల్లోమేలైన దిగుబడికి పాటించాల ్సిన పద్ధతులు

టమాటా మొక్కల్లో మేలైన దిగుబడికి పాటించాల్సిన పద్ధతులు :

1. చేపల అమైనో ఆమ్లం: “Fish Amino Acid"

ఒక లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల చొప్పున చేపల అమైనో ఆమ్లం (Fish Amino Acid) నెలకు రెండుసార్లు foliar spray పిచికారి చేసినట్లయితే మొక్కలు, పండ్ల పెరుగుదల బాగుంది. చేపల అమైనో ఆమ్లంలో నత్రజని అధికంగా ఉంటుంది.

2. పులసిన పండ్ల రసం: Fermented Fruit Juice (FFJ)

లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్ల చొప్పున పులిసిన పండ్ల రసాన్ని నెలకు రెండుసార్లు వాడినట్లయితే పూత బాగా వస్తుంది, పూత రాలటం తగ్గుతుంది.

3. పులిసిన మజ్జిగ: Fermented Butter Milk :

తొమ్మిది లీటర్ల నీటిలో ఒక లీటర్ బాగా పులిసిన మజ్జిగ కలిపి వారానికి ఒకసారి పిచికారి చేసినట్లయితే ఆకుముడత, మజ్జిగ తెగులు, పేనుబంక, దూది పురుగు నివారించబడుతుంది. అలాగే పూత త్వరగా వస్తుంది. పూత రాలడం తగ్గుతుంది. టమాట త్వరగా పక్వానికి వస్తుంది.

4. పెరుగు మీగడ నుండి వెన్న తీసిన తర్వాత మిగిలిన మజ్జిగ:

పెరుగు పై కట్టిన మీగడ కు నీళ్లు చేర్చి చిలికి, వెన్న తీసేసిన తర్వాత వచ్చే మజ్జిగను 5 రోజులు పులియబెట్టి, దానికి లీటరుకు 10లీటర్లు నీళ్ళు కలిపి మొక్క మొదట్లో కనుక ఇచ్చినట్లయితే టమాటాలు తొందరగా పక్వానికి వస్తాయి

5. గుడ్డు నూనెల మిశ్రమం: (Egg Oil Emulsion)

ఈ మిశ్రమాన్ని 10 మిల్లీ లీటర్లు, లీటరు నీటికి చొప్పున కలిపి వారం వ్యవధిలో పిచికారి చేసినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

6. వానపాముల ఎరువు లేదా ఏదైనా ఘన ఎరువు ని నెలకోసారి మొక్కలకు అందించాలి. (Vermi compost )

7. బియ్యం, పప్పు దినుసులు కడిగిన నీటిని ఇతర ద్రవరూప ఎరువులతో కలిపి పిచికారి చేయాలి.

తెలుగు : డాక్టర్ సైదయ్య ఆంగ్లమూలం : ప్రార్థన

Shopping Cart