మిద్దెతోటలో స్ట్రాబెర్రీ మొక్కల పెంపకం – నా అనుభవం (how to grow strawberry plant at home in telugu)
కుండీల్లో స్ట్రాబెర్రీలు పెంచడం చాలా తేలిక, కుండీ సైజు, మట్టి మిశ్రమం, పోషణ, ఎండ ఎంత అవసరం, నాటుకునే మెలకువలు, వీటి గురించి నాకు తెలిసింది చెప్తాను.
స్ట్రాబెర్రీ మొక్కలు ఆగస్టు నుండి జనవరి వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు, నాటిన 45 నుండి 60 రోజులకు పూత కాపు వస్తుంది. సాదారణంగా పండ్లు వచ్చే season అక్టోబర్ నుండి మార్చ్ వరకు. నన్నడిగితే Aug to Nov లోపు పెట్టుకోండి, తర్వాత పెడితే మొక్క బ్రతకోచ్చు కానీ కాపు రావడం కష్టం.
కుండీ ఎత్తు 5 నుండి 8 ఇంచులు, వెడల్పు 5 నుండి 8 ఇంచులు. ఒక్క మాటలో అయితే 8 నెంబర్ కుండీ(ఒక కుండీలో ఒక మొక్క). ఇది సరిగ్గా సరిపోతుంది, అంతకు మించి వేరు వ్యవస్థ వెళ్ళదు.
పొడుగాటి rectangular కుండీల్లో కూడా పెట్టొచ్చు, అదైతే 14 నెంబర్ suitable, ఒక కుండీలో రెండు మొక్కలు పెట్టుకోవచ్చు.
కుండీలో నీరు పోస్తే ఈజీగా బయటికి వెళ్లిపోయే విధంగా కుండికీ అడుగున రంద్రాలు చేసుకోవాలి. మరీ చిన్నవి చెయ్యొద్దు. కనీసం 1cm diameter ఉండేట్టు మూడు holes అయినా చెయ్యాలి. Drain holes చిన్నగా ఉంటే నీరు కుండీలో నిలిచి వేరు కుళ్ళుతుంది, వేర్లకి ఆక్సిజన్ అందుబాటు అవ్వదు. అందుకని holes సరిగ్గా చేసుకోవాలి.
(how to grow strawberry plant at home in telugu)
మట్టి మిశ్రమం అన్ని కూరగాయ మొక్కలకు కలుపుకున్నట్టే స్ట్రాబెర్రీ కి కూడా. మట్టి, ఎరువు, కోకోపీట్ సమ పాళ్ళల్లో తీసుకోవాలి (90%), వేప పిండి, బోన్ మీల్, sea weed గ్రానుల్స్, epsom salt (అన్ని కలిపి 10%). perlite కూడా కలిపితే మంచిది (లేకున్నా ఏం పర్లేదు). అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి.
కుండీలో అడుగున drain holes ని పెంకు ముక్కలు కానీ, చిన్న పాటి రాళ్లు కానీ, చెక్క ముక్కలు కానీ వేసి cover చెయ్యాలి, వాటి మీద 1 inch మందం కోకోపీట్ వెయ్యాలి. Air gaps లేకుండా బాగా అదమండి.
తరువాత లేయర్ బాగా మాగిన పేడ ఎరువు, లేదా fully decomposed కిచెన్ waste compost 2 ఇంచుల మందం వేసి ఇది కూడా కొంచం అదమండి. మిగితా అంతా మనం కలిపి పెట్టిన potting mix నింపండి.
Potting mix నింపేటప్పుడు చాలా మంది చేసే తప్పేంటంటే, కుండీ 8 inch లోతు ఉంటే, మట్టి 6 inch నింపుతారు. మొక్క నాటిన కొన్ని రోజులకు, మట్టి కుదించుకు పోయి 4 inch అవుతుంది, మళ్ళీ extra మట్టి పైనుండి వేస్తారు, అలా చేస్తే strawberry మొక్క చనిపోయే అవకాశం ఎక్కువ.
అందుకే మట్టి మిశ్రమం కుండీ పూర్తిగా నిండే వరకు మంచిగా అదిమి నింపుకోండి, కొన్ని రోజులకు కొంత మట్టి దిగినా problem ఏమి ఉండదు.
Strawberry మొక్కలు నాటుకునే పద్దతి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అన్ని మొక్కల్లా కాదు, కొంచెం డిఫరెంట్. మొక్కకు కొమ్మలు రావు, ఏపుగా పెరగదు, మొక్క మొదలు (crown) నుండి కేవలం ఆకులు, పువ్వులు వస్తుంటాయి. Crown బాగం మునగకుండా, కేవలం వేర్ల వరకు మాత్రమే మట్టిలోపలికి ఉండేట్టు నాటుకోవాలి.
మట్టి మిశ్రమం కలిపి పెట్టుకున్న కుండీల్లో మధ్యలో కొద్దిగా మట్టి తీసి, మొక్క root ball ఏమాత్రం చేదిరి పోకుండా పెట్టాలి, తర్వాత మట్టి మిశ్రమం ఇంకాస్త తీసుకొని వేర్లు కనిపించకుండా పెట్టుకోవాలి.
Crown భాగం ఎట్టి పరిస్థితి లోను మట్టిలో మునిగేటట్టు మాత్రం పెట్టొద్దు, కేవలం వేర్లు మాత్రమే మట్టిలో ఉండాలి. ఇప్పుడే mulching చెయ్యాల్సిన పనిలేదు. నాటుకునే పని సాయంత్రం చేస్తే మంచిది.
నాటుకున్న తరువాత వారం, పది రోజుల వరకు పాక్షికంగా (రోజుకి రెండు గంటలు) ఎండ తగిలే ప్రదేశంలో కుండీలను పెట్టాలి. ఆ తరువాత తెచ్చి పూర్తి ఎండకు పెట్టొచ్చు.
స్ట్రాబెర్రీ మొక్కలకు దాహం ఎక్కువ, మర్చిపోకుండా రోజుకొకసారి నీళ్లు పొయ్యాలి, నీరు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా crown మట్టిలోకి వెళ్లకుండా చేతి వేళ్ళతో చిలకరించండి. మట్టి ఏమాత్రం dry అయినా మొక్క బ్రతకడం కష్టం.
30 నుండి 40 రోజుల్లో నాటిన మొక్కలు బాగా పెరిగి పూత మొదలవుతుంది. పువ్వులు పిందె గా మారే దశలో mulching చేసుకుంటే మంచిది, ఎందుకంటే పిందెలు మట్టికి తగిలితే పాడైపోతాయి.
Mulch చెయ్యకపోయినా వచ్చే నష్టం లేదు కానీ, పిందెలు మట్టికి ఆనకుండా ఏవైనా ఎండాకులు పెట్టుకుంటే చాలు.
రెండు మూడు కోతలు అయ్యేవరకు మొక్కకి ఏమి ఎరువులు ఇచ్చే అవసరం ఉండదు. ఆ తర్వాత పూలు సరిగ్గా రాకపోయినా, కాయలు మంచిది సైజు రాకపోయినా పోషణ అవసరం అని అర్ధం. పేడ ఎరువు or కిచెన్ waste compost లో, బోన్ మీల్, epsom salt, sea weed, వేప పిండి కలిపి మొక్కకి గుప్పెడు చొప్పున, కుండీ అంచులో (మొక్క మొదలుకు దగ్గరగా కాకుండా) కొంచెం మట్టి తీసి, కలిపి పెట్టకున్న ఎరువు వేసి, మళ్ళీ మట్టితో cover చెయ్యాలి.
లేత ఆకులు కూడా ఒక్కోసారి నల్లగా మాడినట్టు అవుతుంటాయి, దాని అర్ధం, ఎండ ఎక్కువైనట్టు, అలాంటప్పుడు మొక్కలు semi shade కి shift చెయ్యండి.
మొక్క గుబురుగా మారి పూత రాకుండా ఉంటే, ముదురు ఆకులను కత్తిరించాలి, అవే mulching కి వాడొచ్చు.
పూత రావడానికి పుల్లటి మజ్జిగ dilute చేసి పొయ్యొచ్చు. మిగతా కూరగాయ మొక్కలకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా ఇస్తామో, స్ట్రాబెర్రీ కి కూడా అంతే ఇవ్వొచ్చు.
చీడపీడలు ఏమి రావు స్ట్రాబెర్రీ మొక్కలకు. నేనైతే చూడలేదు.
March నెల నుండి ఎండలు ముదురుతుంటాయి, అప్పటి నుండి పాక్షికంగా ఎండ ఉండే place లో పెట్టుకోవాలి. ఎండాకాలం కాపాడడం కొంత కష్టమే.
బాగా ముదిరిన మొక్కలకు సన్నగా తీగలు వస్తాయి, వాటినే runners అంటారు. Runners నుండి పిల్ల మొక్కలు చేసుకోవచ్చు. ఒక మొక్క నుండి కనీసం 5 పిల్ల మొక్కలు చేసుకోవచ్చు.
అంతగా హైరానా పడిపోకండి, స్ట్రాబెర్రీ మన వాతావరణంలో కూడా పెరుగుతుంది.
అన్ని మొక్కల్లాగానే స్ట్రాబెర్రీ కూడా మిద్దెతోటలో చక్కగా పెంచొచ్చు. నాటుకోవడంలో జాగ్రత్త వహిస్తే చాలు.
ఇదంతా నేను స్వయంగా పెంచి, చూసి, గమనించి, స్వానుభవంతో తెలుసుకున్న విషయాలు, ఎక్కడో చూసి copy కొట్టింది కాదు. మీ అందరికీ ఉపయోగపడుతుందని రాసాను.
-Sampath Punna – CTG Member